అమెరికా వెన్నులో వణుకుపుట్టించే వార్త…!!  

Corona Cases will Increase in Future, Americans , health department, center for disease control and prevention - Telugu Americans, Center For Disease Control And Prevention, Corona Cases Will Increase In Future, Health Department

కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎంతో మంది అమాయక ప్రజలు బలై పోయారు.ముఖ్యంగా అగ్ర రాజ్యం అమెరికాలో సుమారు 48 లక్షల మందికి ఈ వ్యాధి సోకగా, దాదాపు 1.58 లక్షలమంది పైగానే మృతి చెందినట్టుగా తెలుస్తోంది.ఒక పక్క కరోనా మరొక పక్క ఉద్యోగాలు కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులలో అమెరికా ప్రజలు అల్లాడి పోతున్నారు.

TeluguStop.com - Corona Cases Will Increase In Future

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

ఇప్పటికే రోజుకి సుమారు 50 వేలకి పైచీలుక కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.వందల సంఖ్యలో అమెరికన్స్ ప్రాణాలు పోగొట్టుకుంటూనే ఉన్నారు.ప్రస్తుత పరిస్థితికే అమెరికన్స్ ఆందోళన చెందుతుంటే తాజాగా అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాలు అమెరికా వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి.

TeluguStop.com - అమెరికా వెన్నులో వణుకుపుట్టించే వార్త…-Telugu NRI-Telugu Tollywood Photo Image

అమెరికాలో రానున్న 20 రోజుల్లో పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకోనున్నాయని, మరిన్ని కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా ఊహలకి అందని విధంగా పెరగనున్నాయని తెలిపింది.

ఇదేదో సాదారణ సర్వే అయితే పెద్దగా పట్టించుకునే వారు కాదు కానీ అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ నేరుగా ఈ విషయాలు వెల్లడించడంతో ఇప్పుడు అమెరికన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.వారి అంచనాల ప్రకారం సుమారు 19 వేల మంది రానున్న రోజులలో చనిపోనున్నారట.

అందుకు కారణం కూడా వారు తెలిపారు.అదేంటంటే.

అమెరికాలో కరోనా మహమ్మారి కొత్త రూపు దాల్చిందని గడించిన నెలలు మార్చ్ , ఏప్రియల్ తో పోల్చితే పరిస్థితి మొత్తం మారిపోయిందని అంటున్నారు.ఈ వైరస్ సంక్రమణం అత్యంత వేగవంతంగా ఉందని ప్రకటించారు.ఇక అన్నిటికంటే మరొక ప్రమాదకరమైన విషయమేమిటంటే అమెరికాలోని గ్రామీణ ప్రాంతాలలో కేసుల సంఖ్య ఉదృతం అవుతోందని భవిష్యత్తులో ఆయా ప్రాంతాలలో మరింత ముప్పు ఏర్పడనుందని అంటున్నారు శాస్త్రవేత్తలు.అంతేకాదు కేసులు పెరుగుతున్న సమయంలో నిర్ధారణ పరీక్షలు చేయడం తగ్గించేయడం కూడా ఎంతో ప్రమాదమని ప్రభుత్వం ఈ పరిస్థితుల పట్ల శ్రద్ద వహించాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

#CoronaCases #CenterFor #Americans

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Cases Will Increase In Future Related Telugu News,Photos/Pics,Images..