తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు! ఢిల్లీతో లింక్  

Corona Cases Telugu States Delhi Religion Meeting - Telugu Corona Cases, Corona Virus, Covid-19, Delhi Religion Meeting, Lock Down, Telugu States

ఇప్పటి వరకు సాధారణమైన స్థాయిలో ఉన్న కరోనా కేసులు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా పెరిగాయి.ముఖ్యంగా ఏపీలో అయితే ఈ ఒక్కరోజే ఏకంగా 17 కరోనా పోజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 Corona Cases Telugu States Delhi Religion Meeting

ఇక తెలంగాణలో కూడా కేసుల సంఖ్య పెరుగుతుంది.నిన్న ఒక్కరోజే ఆరు మంది కరోనాతో చనిపోయారు.

నిన్నటి వరకు మరణాలు లేవని అనుకుంటే ఊహించని విధంగా ఆరుగురు చనిపోయారు.వారిలో అందరికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా పెరిగిన కరోనా కేసులు ఢిల్లీతో లింక్-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మరింత అప్రమత్తం అయ్యాయి.ఈ కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడానికి గల కారణాలు గుర్తించాయి.

తెలుగు రాష్ట్రాలలోకి వచ్చిన కరోనా కేసులలో ఎక్కువ శాతం ఢిల్లీలో ముస్లిం మత ప్రార్ధనలకి వెళ్ళినవాళ్ళే అని నిర్ధారించారు.

అయితే ఇన్ని రోజులు వారిని గుర్తించకపోవడంతో ఒక్కసారిగా వారి సంఖ్య బయటపడటంతో, మత ప్రార్ధనలకి వెళ్లి వచ్చిన అందరూ కూడా కరోనా లక్షణాలతోనే బయట తిరగడంతో ఇప్పుడు కరోనా కేసుల సంఖ్యలో ఈ వారంలో మరిన్ని పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఈ నేపధ్యంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రార్ధనలకి వెళ్ళిన వారిని గుర్తించి వారికి నేరుగా హెచ్చరికలు పంపించారు.ఢిల్లీలో ప్రార్ధనలకి వెళ్ళిన వారు స్వచ్చందంగా వచ్చి పరీక్షలు చేయించుకోవాలని లేదంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పాయి.

ఇక మత ప్రార్ధనలకి వెళ్ళిన వారి లిస్టుని కూడా విడుదల చేసాయి.తెలంగాణ నుంచి ఢిల్లీకి మత ప్రార్ధనల కోసం ఎనిమిది వందల మంది వెళ్ళినట్లు గుర్తించారు.

అలాగే ఏపీ నుంచి కూడా 711 మంది వెళ్ళినట్లు గుర్తించారు.వీరిలో ఎంత మందికి కరోనా పోజిటివ్ ఉంది.

వారి నుంచి ఎంత మందికి వచ్చింది అనే వివరాలు తెలియాలంటే వీరంతా బయటకి రావాల్సి ఉంది.మరి ప్రభుత్వ ఆదేశాలు విని వీరిలో ఎంత మంది బయటకి వస్తారు అనేది వేచి చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Cases Rise In Telugu States Connect With Delhi Religion Meeting Related Telugu News,Photos/Pics,Images..