కరోనా అంతం కేసీఆర్ పంతం ? సక్సెస్ దిశగా ?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడా కంగారు పడటం లేదు.ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఎంత తీవ్ర స్థాయిలో ప్రభావం చూపిస్తుందో, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Corona Virus, Telangana, Kcr, Lock Down,containment Zones, Gandhi Hospital, Pres-TeluguStop.com

అయితే ఈ వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి కెసిఆర్ ధైర్యంగానే ఉంటూ వస్తున్నారు.రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్న తరుణంలో ఈ వైరస్ ను తెలంగాణ నుంచి తరిమి కొడతాం అన్న ధీమాను కేసీఆర్ మొదటి నుంచి వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.

ఏప్రిల్ మొదటి వారంలో కరోనా అంశంపై మాట్లాడేందుకు మీడియా సమావేశం నిర్వహించిన కేసీఆర్, గాంధీ ఆస్పత్రిలో 50 మంది కి కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని ప్రకటించారు.ఇక పది, పదిహేను రోజుల్లో వీరంతా కోలుకుంటారని, తెలంగాణ నుంచి పూర్తిగా కరోనా ను తరిమి కొడతామనే ధీమా వ్యక్తం చేశారు.

అయితే కెసిఆర్ ప్రెస్ మీట్ నిర్వహించిన రోజునే తాబ్లిగి, కేసులు బయటకు వచ్చాయి.అదేరోజు ఆరుగురు వ్యక్తులు చనిపోయారు.

ఇక ఆ తర్వాత నుంచి వరుసగా కేసులు పెరుగుతూనే వచ్చాయి.

తాజాగా సోమవారం తెలంగాణలో రెండు కేసులు మాత్రమే నమోదవడంతో కేసీఆర్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.

కేంద్రం లాక్ డౌన్ ను మే మూడో తేదీ వరకు విధించగా కేసీఆర్ మాత్రం తెలంగాణలో ఏడో తేదీ వరకు కొనసాగిస్తామని ప్రకటించారు.అంతేకాకుండా ఆ సమయానికి కరోనా ఫ్రీ స్టేట్ గా తెలంగాణ ఉంటుందంటూ ప్రకటించారు.

తాము ఈ వైరస్ ను అన్ని విధాలుగా కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, గత నాలుగు రోజులుగా పెద్దగా కేసులు నమోదు కాకపోవడం దీనికి నిదర్శనం ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక ప్రభుత్వ అధికారుల నుంచి ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అక్కడ అక్కడ కేసుల సంఖ్య పెరిగినా, కేసీఆర్ విధించిన పగడ్బందీ చర్యలతో, ముందుచూపుతో తెలంగాణలో ప్రస్తుతం కేసుల సంఖ్య తగ్గుతూ వస్తున్నట్లుగా అధికారులు అంచనాకు వచ్చారు.

Telugu Corona, Gandhi, Lock, Press Meet, Tablighi, Telangana-Latest News - Telug

లాక్ డౌన్ మే 7వ తేదీ వరకు ఉండడంతో ఆ గడువు పూర్తయ్యేసరికి మొత్తం కరోనా ఫ్రీ రాష్ట్రంగా తెలంగాణ మారుతుందనే అభిప్రాయం కేసీఆర్ లో బాగా కనిపిస్తోంది.ప్రస్తుతం తెలంగాణలో నమోదవుతున్న కొత్త కేసులు కంటోన్మెంట్ నుంచే వస్తున్నాయి.మే 7వ తేదీ నాటికి కంటోన్మెంట్ జోన్లను చాలావరకు తగ్గించాలని చూస్తున్నారు.

ఇక అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పాజిటివ్ కేసులు పెరగకుండా చూసుకోవాలని అత్యంత కఠినంగా లాక్ డౌన్ నిబంధనలను పాటించాలంటూ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మొత్తంగా చూస్తే కెసిఆర్ నిర్ణయాలు మొదట్లో కాస్త కటువుగా ఉన్నట్టు కనిపించినార్ వాటి ఫలితాలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube