అమెరికాకి బిగ్ షాక్ : న్యూయార్క్ లో కరోనా యూటర్న్..!!

కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తే.అమెరికాలో మాత్రం ప్రళయాన్ని సృష్టించిందనే చెప్పాలి.

 Corona Cases Increased In New York, Coronavirus, New York, New York Governor And-TeluguStop.com

బహుశా మరే దేశంలో కూడా కరోనా ఈ స్థాయిలో ప్రభావం చూపలేదు.అమెరికాపై కరోనా పగ బట్టిండా, లేక పగబట్టేల చేశారా అనే అనుమానాలు రేకెత్తాయి కూడా.

అయితే అమెరికాలో కరోనా ధాటికి ఇప్పటికే 2 లక్షల మంది మృతి చెందగా, లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడ్డారు.ముఖ్యంగా అమెరికాలో న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలలో కరోనా మహమ్మారి విజ్రుంభణతో లెక్కకి మించిన అమెరికన్స్ ఆ ప్రాంతాలనుంచీ మృత్యువాత పడ్డారు.

అమెరికా ఆర్ధిక రాజధాని అయిన న్యూయార్క్ లో శవాల దిబ్బలుగా మారిపోయిన సంఘటనలు నేటికి కళ్ళముందు కనపడుతూనే ఉన్నాయి.అయితే మెల్ల మెల్లగా కరోనా ప్రభావం నుంచీ కోలుకుంటూ అతి తక్కువ స్థాయి కేసులు నమోదు చేసుకుని దాదాపు కరోనా రహిత రాష్ట్రంగా మారిన న్యూయార్క్ నగరంలో కరోనా మరోసారి యూటర్న్ తీసుకుంది.

మరోసారి ఈ మహమ్మారి రక్కసి పంజా విసిరింది.తాజాగా న్యూయార్క్ నగరంలో సుమారు లక్ష మందికి కరోనా టెస్ట్ లు నిర్వహించగా దాదాపు 1000 కి పైగా కేసులు నమోదు కావడం స్థానిక ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టేసింది.

జూన్ లో కరోనా తీవ్రస్థాయిలో నమోదు అయిన తరువాత ఆ స్థాయిలో మళ్ళీ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ తెలిపారు.రోజుకి సగటుకు 600 లకు పైగా కేసులు నమోదు అవుతున్నాయని అన్నారు.

అందుకు ఏకైక కారణం వ్యాపార, విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కావడంవలనే జరిగిందని ప్రకటించారు.ప్రస్తుతం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, మరిన్ని కేసులు రాకుండా జాగ్రత్త పడుతామని, ప్రజలు అందరూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు ఆండ్రూ.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube