ఆందోళనలో అమెరికా..ఒక్క రోజులోనే 54 వేల కేసులు..  

America, Corona virus, Corona effect, America corona cases increased - Telugu America, America Corona Cases Increased, Corona Effect, Corona Virus

అగ్ర రాజ్యం అమెరికా కరోనా టెన్షన్ తో వణికిపోతోంది.అమెరికాలో పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయని ప్రభుత్వాలు చెప్తున్నా పరిస్థితులు ఏ మాత్రం అందుకు తగ్గట్టుగా లేవని తాజా నివేదికలు తేటతెల్లం చేస్తున్నాయి.గతంలో ఒక్క రోజులో 5 వేల కేసులు.20 వేల కేసులకి అమెరికన్స్ కంగారుపడిపోయేవారు.కానీ తాజాగా ఒక్క రోజులోనే అమెరికా వ్యాప్తంగా 54 వేల కేసులు నమోదు కావడంతో తాజాగా పరిస్థితులపై అమెరికన్స్ ఆందోళన చెందుతున్నారు.

 Corona Cases Increased America

ప్రపంచంలో ఎక్కడా నమోదు కాని విధంగా రికార్డ్ స్థాయిలో ఒక్క రోజులో ఇన్ని కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది.

గడించిన రెండు వారాలలో సుమారు 20 వేల కేసులు నమోదు కాగా ప్రస్తుతం తాజాగా ఇన్ని కేసులు నమోదు కావడం ప్రభుత్వాలకి టెన్షన్ పెట్టిస్తోంది.దేశ వ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతుండగా ఫ్లోరిడా రాష్ట్రంలో అత్యధికంగా కేవలం ఒక్క రోజులో 10 వేల కేసులు నమోదు అయ్యాయి.ఇదిలాఉంటే

ఆందోళనలో అమెరికా..ఒక్క రోజులోనే 54 వేల కేసులు..-Telugu NRI-Telugu Tollywood Photo Image

ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా 29 లక్షల కేసులు నమోదు కాగా 1.30 లక్షలకి పైగా అమెరికన్స్ మృత్యు వాత పడ్డారు.అయితే 11 లక్షల మందికి పైగా ప్రజలు వ్యాధి నుంచీ బయటపడ్డారని తెలుస్తోంది.ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం రోజుకి లక్ష కేసులు నమోదైనా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని , ఇకపై అయినా ప్రభుత్వం చర్యలు చేపట్టక పొతే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

#America #Corona Effect #Corona Virus

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Cases Increased America Related Telugu News,Photos/Pics,Images..