ఏపీలో గత 24 గంటల్లో భారీగా పెరిగిన కరోనా కేసులు.. !

కరోనా విషయంలో మరో సారి దేశంలో ఆందోళన మొదలవుతుంది.ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ దిశగా అడుగులు వేస్తుండగా, మరి కొన్ని చోట్ల తీసుకోవలసిన నిర్ణయాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరుపుతున్నాయి.
ఇక గత నెలరోజుల క్రితం వరకు చాలా తక్కువగా నమోదైన కోవిడ్ కేసులు ఈ మధ్య కాలంలో విజృంభిస్తున్నాయి.ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని ఆరోగ్య శాఖ వెల్లడిస్తుంది.

 Corona Cases Increasing In Ap, Covid Cases, Active Corona Cases, Ap, Corona Case-TeluguStop.com

కాగా తాజాగా విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.గడిచిన 24 గంటల్లో ఏకంగా 585 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తుంది.

ఇక చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 128 కేసులు నమోదవగా, 99 కేసులతో రెండో స్థానంలో గుంటూరు జిల్లా ఉందని, చివరి స్థానంలో 8 కేసులతో కడప జిల్లా ఉందని వెల్లడించింది.ఇదే సమయంలో చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా వల్ల ప్రాణాలు కోల్పోగా వీటితో కలిపి కరోనాతో మరణించిన వారి సంఖ్య ఇప్పటి వరకు 7,197 చేరుకుందట.

ఇక రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,95,121 ఉండగా, ఇదే సమయంలో 8,84,978 మంది కరోనా నుంచి కోలుకున్నారని, ప్రస్తుతం రాష్ట్రంలో 2,946 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube