రికార్డు స్థాయిలో భారత్ లో కరోనా కేసులు..!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది.దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

 India, Corona, Cases, Reacord,-TeluguStop.com

ఒక్క రోజులనే భారీగా కేసులు నమోదు కావడం భారత్‌లోనే కాదు, ప్రపంచంలోనే ఇదే మొదటిసారి.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 86,432 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.

గత 24 గంటల్లో 1,089 మంది ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.అంతేకాక ఈ వైరస్ బారి నుండి 70 వేల మందిసంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కోలుకున్నవారి మొత్తం సంఖ్య 31,07,223కి చేరుకుంది.

ఇక ఈ మహమ్మారి బారిన పడి 8,46,395 మంది చికిత్స పొందుతూనే ఉన్నారు.

ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది.ఇక దేశవ్యాప్తంగా కరోనా బాధితుల రికవరీ రేటు 77.15 శాతంగా ఉందని వెల్లడించారు.ఇక ప్రపంచవ్యాప్తంగా 63,89,057 కరోనా కేసులతో అమెరికా ప్రధమ స్థానంలో ఉంది.40,91,801 కేసులతో బ్రెజిల్‌ తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.తాజాగా 40,23,179 కేసులతో భారత్‌ మూడో స్థానంలో నిలిచింది.

ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కేసులను బట్టి చూస్తుంటే భారత్‌ బ్రెజిల్‌ను దాటేసి రెండో స్థానానికి చేరుకుంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube