ఏపీలో కరోనా కేసులు.. ఈరోజు ఎన్ని నమోదయ్యాయంటే.. ?

తెలుగు రాష్ట్రాల్లో కరోనా విజృంభన మళ్లీ మొదలవుతుంది.ఇప్పటికే కోవిడ్ 19 కేసులు అక్కడక్కడ నమోదు అవుతున్నాయి.

 Corona Cases In Ap How Many Were Registered-TeluguStop.com

ఈ నేపధ్యం లో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ గడిచిన 24 గంటల్లో రాష్ట్రం లో నమోదైన కరోనా వివరాలను వెల్లడించింది.ఆ వివరాలు తెలుసుకుంటే ఏపీలో ఈ రోజు కొత్తగా 115 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

ఇకపోతే వైరస్‌ బారినపడిన వారిలో 93 మంది కోలుకోగా, ఒక మరణం చిత్తూరు‌ జిల్లాలో చోటు చేసుకుందట.

ఇక ఇప్పటి వరకు ఏపీలో 8,90,556 మంది కరోనా బారిన పడగా, మొత్తం 8,82,462 మంది ఇప్పటి వరకు కోలుకున్నారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

అయితే మరో 921 మందికి వైద్యులు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారట.ఇక కరోనా వైరస్ ప్రభావంతో 7173 మంది మృత్యువాత పడ్డారని ఆరోగ్యశాఖ పేర్కొంది.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 46,566 శాంపిళ్లను పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

#Corona Cases #Registered #Today #How Many

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు