ఏపీ లో తగ్గని కరోనా జోరు ...!

దేశంలో ఐదవ సారి లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుండి కరోనా కేసులు అమాంతం పెరుగుతూ వస్తున్నాయి.ఈ నేపథ్యంలో ప్రపంచంలో భారతదేశం కరోనా కేసుల సంఖ్య నాలుగో స్థానాన్ని చేరుకుంది.అన్ లాక్ 1.0 మొదలైనప్పటి నుండి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా కరోనా కేసులు నమోదవుతున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం.ఇకపోతే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ గడచిన 24 గంటల్లో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలను బులిటెన్ ద్వార మీడియాకు విడుదల చేసింది.తాజాగా 20,567 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 961 కేసులు పాజిటివ్ అని తేలడంతో, వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 37 మంది కూడా కరోనా వైరస్ నిర్ధారణ అవ్వడంతో 998 కేసులు కొత్తగా నమోదయ్యాయి.

 Corona Positive, Corona Cases, Bulletin, Andhra Pradesh, Corona Cases In Ap-TeluguStop.com

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో ఆసుపత్రి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు.దీంతో ఇప్పటివరకు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 18,697 కు చేరుకుంది.

మరోవైపు రాష్ట్రంలో 10,043 కేసులు యాక్టివ్ గా కొనసాగుతున్నాయి.తాజా బులెటిన్ ప్రకారం గడిచిన 24 గంటల్లో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.

దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 232 మంది కరోనా బారినపడి మృతి చెందారు.

రాష్ట్రంలో నేటి వరకు 10,17,140 శాంపిల్స్ ను పరీక్షించారు.

నేటి వరకు రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 2451 కేసులు నమోదయ్యాయి.ఇక తాజాగా గుంటూరు జిల్లాలో ఏకంగా 157 కేసులు నమోదయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube