తగ్గుతున్న కరోనా కేసులు... వెంటాడుతున్న ఆ భయం ! 

కరోనా సెకండ్ వేవ్ భారత్ ను ఒక కుదుపు కుదిపింది.ఇప్పటికీ దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూనే వస్తున్నాయి.

 Corona Cases Are Declining But There Is A Growing Fear Among The Population With-TeluguStop.com

కాకపోతే గతంతో పోలిస్తే ఈ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పట్టడం కాస్త ఊరటనిచ్చే అంశం.మొదటిదశ కరోనా విలయతాండవం చేసినా, ప్రాణ నష్టం పెద్దగా లేదు.

కానీ రెండో దశ కరోనా విజృంభించిన సమయంలో పెద్ద ఎత్తున మరణాలు  చోటుచేసుకున్నాయి.లక్షల సంఖ్యలో జనాలు మృతిచెందినా, అధికారికంగా మాత్రం వేలల్లోనే ఆ కేసులు నమోదయ్యాయి . పట్టణం ,పల్లె అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ ఈ మహమ్మారి తన ప్రతాపాన్ని చూపించింది.ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు నమోదు అయిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో కి వెళ్ళిపోయింది.

మొదట్లో నిత్యం నాలుగు లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అయితే ఇప్పుడు ఆ కేసు సంఖ్య రెండు లక్షలకు చేరుకోవడం ఊరటనిచ్చే అంశం గానే చెప్పుకోవాలి.

పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ వస్తుండడం తో జనాలు కాస్త ఊరట చెందుతున్న ,  బ్లాక్, వైట్ ,ఎల్లో ఫంగస్ కేసులు కొత్తగా నమోదు అవుతుండడం ఆందోళన కల్గిస్తోంది.ముఖ్యంగా బ్లాక్ వైరస్ కారణంగా ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రాణ నష్టం రానున్న రోజుల్లో మరీ ఎక్కువగా ఉండేలా కనిపిస్తోంది.ఇప్పుడు ఈ వైరస్ ను ఎదుర్కొనే మందు కోసం అన్వేషణ సాగుతోంది.

విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ వ్యాక్సిన్ ను ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇవి కాకుండా మూడోదశ కరోనా శరవేగంగా వ్యాపించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.

Telugu Black Fungas, Carona, Covid, India, Wave Carona, White Fungas, Yellow Fun

ఈ దశలో చిన్న పిల్లలపై ప్రభావం ఎక్కువ చూపిస్తుందనే వార్తలు మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి.ఇప్పటికే కరోనా భయం తో చాలా రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. మహారాష్ట్ర ఢిల్లీ వంటి రాష్ట్రాలు అందరికంటే ముందుగా ఈ లాక్ డౌన్ ను అమలు చేశాయి.కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అని వదిలివేయకుండా, ముందుగానే అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

కాకపోతే కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తున్న తీరుతో జనాల్లో టెన్షన్ పెరిగిపోతోంది.రెండో దశ కరోనా విజృంభించినా, కేంద్రం వాక్సిన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో కానీ , ముందు చూపుతో వ్యాక్సిన్  ఎగుమతి చేయకుండా దేశ పౌరులకు వాక్సిన్  వేయాలని విషయాన్ని గుర్తించకపోవడం,  ఇలా ఎన్నో అంశాలను జనాలు గుర్తుచేసుకుంటున్నారు.

మూడో దశ ప్రారంభం కాకముందే దానిని ఎదుర్కొనేందుకు అవసరమైన వాక్సిన్ ను కేంద్రం అందుబాటులోకి తీసుకురావాలనే డిమాండ్ ఇప్పుడు పెరిగిపోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube