ప్రపంచం మొత్తానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి రోజు రోజుకి ఉగ్ర రూపం దాల్చుతోంది.ముఖ్యంగా అమెరికాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే లక్షలాది మంది ప్రజలు కరోనా బారిన పడి చికిత్స పొందుతున్నారు.
ఒక్కో రోజుకి 50 వేలకి పైగా కేసులు పెరుగుతూనే ఉన్నాయి, వందల మంది మృతి చెందుతున్నారు.రానున్న రోజుల్లో కరోనా బాధితుల సంఖ్య రోజుకి లక్ష మందికి చేరుకున్నా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే.
అమెరికా ప్రజలు అప్రమత్తం చేస్తూ రాష్ట్రాలన్నీ రక్షణ జాగ్రత్తలు చేపడుతున్నాయి.
సామాజిక దూరం పాటించాలని, అలాగే బయటకి వచ్చే సమయంలో మాస్క్ లు తప్పకుండా ధరించి రావాలని.గుంపులు గుంపులుగా ఎక్కడా చేరవద్దని ప్రకటనలు జారీ చేస్తూనే ఉన్నాయి.
ఎన్ని హెచ్చరికలు చేసినా రోజు రోజుకి కరోనా రోగుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది.అమెరికాలో కేవలం ఐదు రాష్ట్రాలలో లెక్కకి మించి కేసులు నమోదు అవుతున్నాయి.
అమెరికాలో కీలక రాష్ట్రాలైన కాలిఫోర్నియా , న్యూయార్క్ , ఫ్లోరిడా, టెక్సాస్, జార్జియా ఈ ఐదు రాష్ట్రాలలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతోంది.ఈ ఐదు రాష్ట్రాల్లో అన్నిటికంటే కూడా కాలిఫోర్నియా లో 5.59 లక్షల కేసులు నమోదు అయ్యాయని తెలుస్తోంది అలాగే కాలిఫోర్నియా తరువాత ఫ్లోరిడా లో 5.32 లక్షల కేసులు నమోదు కాగా , టెక్సాస్ లో 5 లక్షలు, న్యూయార్క్ లో 4.50 లక్షలు, జార్జియాలో 2.16లక్షల కేసులు నమోదు అయ్యాయి.అయితే కరోనకి వ్యాక్సిన్ వచ్చేంత వరకూ ఈ పరిస్థితి అదుపులోకి వచ్చేలా లేదని అంటున్నారు వైద్య నిపుణులు.