భార‌త్‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌.. తాజాగా ఎన్ని నమోదు అయ్యాయంటే.. ?

దేశంలో మరోసారి వింజృంభిస్తున్న కోవిడ్ 19 ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న విషయం తెలిసిందే.ఒక దశలో ఈ కరోనా మనల్ని ఏం చేయదని ఫిక్స్ అయిన వారు కూడా ప్రస్తుత పరిస్దితుల్లో తమ ఆలోచనల్లో మార్పు తెచ్చుకోవలసిన అవసరం ఉన్నట్లుగా కనిపిస్తుంది.

 Corona Case Updates In India How Many Have Been Registered-TeluguStop.com

మాకేం కాదంటే, మీకు ఏం కాదు.కానీ మీతో పాటుగా మీ కుటుంబం ఉంటుందిగా వారి గురించి కాస్త ఆలోచించవలసిన అవసరం ఉంది.

కాబట్టి నిర్లక్ష్యం తగదని అధికారులు విన్నవిస్తున్నారు.

 Corona Case Updates In India How Many Have Been Registered-భార‌త్‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌.. తాజాగా ఎన్ని నమోదు అయ్యాయంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇకపోతే కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను ఈ రోజు ఉదయం విడుదల చేసింది.

వాటి వివరాలు తెలుసుకుంటే.భార‌త్‌లో గత 24 గంటల్లో 18,711 మందికి కరోనా నిర్ధారణ అయిందని, ఈ మాయదారి రోగం నుండి ఇప్పటి వరకు 14,392 మంది కోలుకున్నారని వెల్లడించింది.

ఇక గడచిన 24 గంట‌ల సమయంలో 100 మంది కరోనా కారణంగా మృతి చెందారని, దీంతో మృతుల సంఖ్య 1,57,756 కు చేరుకోగా, మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,10,799కు చేరింది.కాగా కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,68,520 మంది కోలుకున్నారు.

ఇక ప్రస్తుతం 1,84,523 మంది ఆసుపత్రుల్లో, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారట.

#Corona Virus #Corona Case #India #Updates #CoronaCases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు