మళ్ళీ ఈటెలపైనే కరోనా భారం... గట్టెక్కించేనా?

తెలంగాణలో కరోనా విజ్రుంభిస్తోంది.రోజు రోజుకు కరోనా మరణాలు, కేసులు పెరుగుతున్నాయి.

 Corona Burden On The Spears Again On Etela Rajender Gattekkinchena, Telangana Po-TeluguStop.com

జనాలు పిట్టల్లా రాలోపోతున్న పరిస్థితి ఉంది.రెండో దశ మొదట్లో ఆక్సిజన్ కొరత తీవ్రతతో కరోనా మరణాలు సంభవించిన పరిస్థితులలో అప్రమత్తమైన ప్రభుత్వం త్వరితగతిన యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ ట్యాంక్ లను తెప్పించింది.

అయితే ప్రభుత్వం తరపున వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కరోనా పరిస్థితి మొత్తాన్ని పర్యవేక్షణ చేసిన సంగతి తెలిసిందే.అయితే రెండో దశలో కరోనా తీవ్ర స్థాయిలో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది.

అయితే ప్రభుత్వం తరపున ఏ మంత్రి కూడా కరోనాపై స్పందించలేదు.

ఒక్క ఈటెల మాత్రమే కరోనా వల్ల సంభవించిన పరిస్థితులను, ప్రతిపక్షాల విమర్శలను ఎదుర్కొన్నారు.

అయితే మొదటి దశ కరోనా వైరస్ విజృంభణను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడన్న పేరు ఉంది.ఈసారి కూడా కరోనాను కూడా ఈటెల భారం వేసుకొని మోస్తున్న పరిస్థితి ఉంది.

ప్రభుత్వం తరపున ఏ మంత్రి కూడా ఈటెలకు మద్దతుగా మాట్లాడడం కాని ఉండదు.ఇది కూడా మంచికే అని చెప్పవచ్చు.ఎందుకంటే క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతుంది, తీసుకున్న చర్యలలో ఎటువంటి లోపాలు ఉన్నాయనే విషయాలపై క్లారిటీ వస్తుంది.మరి మొదటి దశలాగా ఈ సారి కూడా ఈటెల సమర్థవంతంగా గట్టేక్కిస్తాడా లేడా అన్నది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube