కరోనా తెచ్చిన కొత్త తంటా..  

Corona brings new Problems Coronavirus, Earproblem, BMJ Journal, University College Of London, Anti Wiral Drug - Telugu Anti Wiral Drug, Bmj Journal, Coronavirus, Earproblem, University College Of London

ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాధి వ్యాప్తి, వ్యాధి లక్షణాల గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.శాస్త్రవేత్తలు రోజుకో కొత్త విషయాన్ని తెలియజేస్తున్నారు.

TeluguStop.com - Corona Brings New Problems

ఈ నేపథ్యంలో తాజాగా వైరస్ ప్రభావం బాధితులపై ఏ విధంగా ఉంటుందనే దానిపై శాస్త్రవేత్తలు కొత్త అంశాన్ని వెల్లడించారు.వ్యాధి నుంచి కోలుకున్న వారిలో వినికిడి లోపం లేదా పూర్తిగా వినికిడిని కోల్పోవడం.

జరిగే అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ పరిశోధకులు తెలియజేశారు.కరోనా సోకిన తర్వాత స్టెరాయిడ్ ఔషధాలు ఇచ్చిన అనంతరం వాటి ప్రభావం విపరీతంగా ఉంటుంది అన్నారు.

TeluguStop.com - కరోనా తెచ్చిన కొత్త తంటా..-General-Telugu-Telugu Tollywood Photo Image

బాధితులు వినికిడి శక్తి కోల్పోయే ప్రమాదం ఉందని అన్నారు.ఫ్లూ తదితర వ్యాధుల వైరల్ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు కూడా ఇలా జరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

బి ఎం జె జర్నల్ లో ప్రచురితమైన నివేదిక ప్రకారం బ్రిటన్కు చెందిన ఒక వ్యక్తి కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరాడు.పదిరోజుల తర్వాత చికిత్సలో భాగంగా అతని ని ఐసీయూ కి తరలించాల్సి వచ్చింది.

బాధితుడు 30 రోజుల పాటు చికిత్స పొందాడు.తర్వాత బాధితునిలో ఇతర అనారోగ్య లక్షణాలు కనిపించాయి.

దీంతో బాధితునికి యాంటీ వైరల్ డ్రగ్ రెమెడెసెవిల్, స్టెరాయిడ్స్ ఇచ్చారు.అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యుజన్ కూడా చేశారు.

ఈ విధమైన చికిత్స అనంతరం బాధితుడు వ్యాధి నుంచి కోలుకున్నాడు.అయితే కొద్ది రోజుల తర్వాత.

తనకు చెవిలో గంట మోగుతున్నట్లు శబ్దం వినిపించింది అని, తర్వాత వినికిడి శక్తి కోల్పోయానని వైద్యులకు ఫిర్యాదు చేశాడు.బాధితుడిని పరిశీలించిన వైద్యులు కరోనా వ్యాధి సోకడానికి ముందు ఎటువంటి వినికిడి లోపం లాంటి సమస్యలేవీ లేవని తేల్చి చెప్పారు.

దీంతో పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాధితుని చెవులకు పరీక్ష చేయగా.లోపలి భాగంలో వాపు కనిపించింది.

దీనిని గుర్తించాక బాధితునికి పలు టెస్టులు చేసారు.ఈ టెస్టుల వలన కూడా వినికిడి శక్తి కోల్పోవడానికి కారణాలు తేలలేదు.

దీంతో పరిశోధకులు బాధితుడు వినికిడి శక్తి కోల్పోవడానికి కరోనా వ్యాధే కారణమని, దీని పై ఇంకా పరిశోధనలు సాగించాల్సి ఉందని తెలిపారు.

#Anti Wiral Drug #Earproblem #BMJ Journal #Coronavirus

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Brings New Problems Related Telugu News,Photos/Pics,Images..