బ్రెజిల్‌లో మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ కరోనా.. ఊహించని స్దాయిలో కేసులు...

మనిషిలో తనకు తెలియకుండా ఉన్న నిర్లక్ష్యం ఎంత ప్రమాదం అయినదో చాలా సందర్భాల్లో నిరూపించబడింది.ప్రస్తుతం కరోనా విషయంలో కూడా రుజువు అయ్యింది.

 Corona Booming Again In Brazil Unexpected Cases-TeluguStop.com

కరోనా కాస్త తగ్గగానే చాలా మంది ఈ రోగం ఇక వ్యాపించడం తగ్గిపోయిందిలే అనుకుని నిర్లక్ష్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టారు.గత సంవత్సరం మొత్తం నరకం అనుభవించిన ప్రజలు ప్రస్తుతం ఇలా డీలా పడగానే కరోనా యాక్టీవ్‌గా మారీ మళ్లీ తన ప్రతాపం చూపిస్తుంది.

ఈ క్రమంలో కొత్త కరోనా కేసులు నమోదు అవడం మొదలుపెట్టాయి.ఇకపోతే ఈ కరోనా మ‌హ‌మ్మారి బ్రెజిల్‌లో మ‌ళ్లీ విజృంభిస్తున్న‌దట.గ‌త 24 గంటల్లో భారీ సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయని, అలాగే మ‌ర‌ణాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతున్న‌దని ఇక్కడి అధికారులు ప్రకటించారు.కాగా సోమ‌వారం రాత్రి నుంచి మంగ‌ళ‌వారం రాత్రి వ‌ర‌కు కేవ‌లం 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 1,641 మంది క‌రోనా రోగులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం.

 Corona Booming Again In Brazil Unexpected Cases-బ్రెజిల్‌లో మ‌ళ్లీ విజృంభిస్తున్న‌ కరోనా.. ఊహించని స్దాయిలో కేసులు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్ర‌స్తుతం క‌రోనా విస్తృతితో దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని ఆస్పత్రుల్లో 80 శాతం ఐసీయూ బెడ్లు నిండిపోయాయని వెల్లడిస్తున్నారు.కాగా, తాజా మ‌ర‌ణాల‌తో క‌లిపి బ్రెజిల్‌లో క‌రోనా బారిన‌ప‌డి మృతిచెందిన వారి సంఖ్య 2,57,361 కి చేరిందట.

అయితే దేశంలో ప‌రిస్థితి మ‌రింత విష‌మించ‌కుండా ఉండాలంటే ముందుజాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకోవాల‌ని బ్రెజిల్‌ ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.

#CoronaCases #COVID-19 #Brazil #Corona Virus

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు