తెలంగాణలో కరోనా విజృంభణ.. మొత్తం కేసులు 64,786  

corona boom in telangana total cases 64786, telangana, corona, cases , Corona Tests, Hyderabad, GHMC - Telugu Cases, Corona, Corona Tests, Ghmc, Hyderabad, Telangana

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తోంది.రోజూ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది.

 Corona Boom In Telangana Total Cases 64786

ఇప్పటి వరకూ 1500 నుంచి 1800 కేసులు నమోదు కాగా.శుక్రవారం ఒక్కరోజే 2083 కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో కరోనా పేషంట్ల సంఖ్య 64,786కి చేరింది.

తెలంగాణలో కరోనా విజృంభణ.. మొత్తం కేసులు 64,786-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న కోవిడ్ యాంటిజెన్ ర్యాపిట్ టెస్టులు శుక్రవారం ఒకటే రోజు 21,011 నిర్వహించారు.ఇప్పటి వరకూ మొత్తంగా 4,58,593 టెస్టులు నిర్వహించగా 883 టెస్టుల ఫలితాలు రావాలి.11 మంది మరణించడంతో మరణాల సంఖ్య 530కి చేరింది.1,114 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.దీంతో ఇప్పటివరకు వారి సంఖ్య 46,502కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న యాక్టివ్ కేసులు 17,754, వీరిలో హోం క్వారంటైన్ లో ఉన్న వారు 11,359 మంది.

హైదరాబాద్ నగర జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం 578 కేసులు నమోదయ్యాయి.

రంగారెడ్డి 228, మేడ్చల్ 197, వరంగల్ అర్బన్ 134, కరీంనగర్ 108, నిజామాబాద్ 73, నల్గొండ 48, మహబూబాబాద్ 40, పెద్దపల్లి 42, రాజన్న సిరిసిల్ల 39, భద్రాద్రి కొత్తగూడెం 35, ఖమ్మం 32, ఆసిఫాబాద్ 8, నారాయణ్ పేట్ 9, వనపర్తి 9. ఇలా అన్ని జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి.

#Corona Tests #Hyderabad #Telangana #Cases #Corona

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Boom In Telangana Total Cases 64786 Related Telugu News,Photos/Pics,Images..