కడప సెంట్రల్ జైలులో కరోనా విజృంభణ

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది.రోజుకు జిల్లా వ్యాప్తం వేలల్లో కేసులు నమోదవుతున్నాయి.

 Corona Boom In Kadapa Central Jail-TeluguStop.com

మనుషుల మధ్య వ్యత్యాస బేధం చూడకుండా కరోనా అందరికి సోకుంతుంది.తాజాగా కడప జిల్లా సెంట్రల్ జైల్ లో కరోనా కలవరం రేపుతోంది.

జైలులో ఉన్న 19 మంది ఖైదీలకు కరోనా సోకింది.గత కొద్ది రోజులుగా కొన్ని జిల్లాలో జైలులో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలకు కరోనా సోకుతుండటంతో కడప సెంట్రల్ జైలులోని ఖైదీలకు పరీక్షలు నిర్వహించారు.

 Corona Boom In Kadapa Central Jail-కడప సెంట్రల్ జైలులో కరోనా విజృంభణ-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మేరకు 19 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని డాక్టర్లు నిర్ధారించారు.దీంతో అప్రమత్తమైన అధికారులు స్థానిక ఫాతిమా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అనంతరం జైలును పూర్తిగా శానిటైజేషన్ చేయించారు.మిగిలిన ఖైదీల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు.

కడప జిల్లాలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.జిల్లాలో ఇప్పటివరకూ 14 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.వీరిలో 7,207 మంది డిశ్చార్జి అయ్యారు.యాక్టివ్ కేసులు 6,706 కేసులు నమోదు కాగా, జిల్లాలో ఇప్పటివరకు 148 మంది మరణించారు.

కేసుల సంఖ్య పెరుగుతుందటంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది.కరోనా కట్టడికి తగిన జాగ్రత్తలు పాటిస్తోంది.

ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించాలని సూచించింది.

#Kadapa #Central Jail #Corona #CoronaCases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు