వామ్మో క‌రోనా.. ఆ జంతువులోనూ క‌నిపించిన యాంటీబాడీలు!

క‌రోనా వ‌చ్చి ఏడాది దాటుతున్నా దాని ప్ర‌భావం మాత్రం ఇంత కూడా త‌గ్గ‌ట్లేదు.రోజుకో కొత్త రూపంలో వ‌ణికిస్తూనే ఉంది.

 Corona Antibodies Found In That Animal-TeluguStop.com

ఇక ఇప్పుటి వ‌ర‌కు కేవ‌లం మ‌నుషుల్లోనే బ‌య‌ట‌ప‌డ్డ క‌రోనా కాస్త ఇప్పుడు జంతువుల్లోనూ ద‌ర్శ‌న‌మిస్తోంది.దీంతో అస‌లు ఏ జంతువులో ఎప్పుడు బ‌య‌ట ప‌డుతుందో తెలియ‌ని ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి.

మొన్న‌టికి మొన్న పులులు, సింహాల్లోనే బ‌య‌ట‌ప‌డితే ఇప్పుడు గేదెలు, జింక‌ల్లోనూ క‌నిపిస్తోంది.ఇక ఇప్పుడు మొద‌టి సారి ఓ జింక‌లో యాంటీబాడీలు క‌నిపించ‌డం సంచ‌ల‌నం రేపుతోంది.

 Corona Antibodies Found In That Animal-వామ్మో క‌రోనా.. ఆ జంతువులోనూ క‌నిపించిన యాంటీబాడీలు-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో ఇప్ప‌టి దాకా కేవ‌లం మనుషుల్లో మాత్రమే కనిపించిన కరోనా వైర‌స్ జంతువుల్లోనూ పాకుతోందా వాటిల్లో కూడా వ్యాపించ‌డం మొదలైందా అనే కోణంలో ప్ర‌పంచ సైంటిస్టులు మేథోమ‌ధ‌నం చేస్తున్నారు.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం జూ పార్క్ లో ఉన్న పులికి లేదా ఇత‌ర జంతువుల్లోనే బ‌య‌ట‌ప‌డ్డ ఈ క‌రోనా ఆన‌వాళ్లు కాస్తా ఇప్పుడు అడవుల్లో సంచ‌రించే జింక‌లో క‌నిపించ‌డ‌మే ఇప్పుడు పెద్ద మిస్ట‌రీగాఇ మారింది.

ఎందుంక‌టే అస‌లు అడ‌వి జంతువుల్లోకి క‌రోనా ఎలా వ్యాపించిందా అనేది అర్థం కావ‌ట్లేదు.

అస‌లు ఇది ఎలా బ‌య‌ట‌ప‌డిందంటే సెకండ్ వేవ్ ప్రారంభంలో సైంటిస్టులు క‌రోనాను క‌నిపెట్టే క్ర‌మంలో అడవి జంతువులో కూడా శాంపిల్స్‌ను ప‌రీక్షించ‌గా ఏకంగా తెల్ల తోక ఉన్న ఓ జింకలో ఈ విధ‌మైన క‌రోనా యాంటీబాడీలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

అయితే ఈ జింక‌లో 40శాతం వ‌ర‌కు శాంపుల్స్ లో ఇదే విధంగా యాంటీబాడీలు క‌నిపించాయి.అయితే ఈ జంతువుకు SARS-CoV2 అనే వేరియంట్ వచ్చి తగ్గి ఉంటుంద‌ని సైంటిస్టులు భావిస్తున్నారు.

మొత్తానికి ఇప్పుడు క‌రోనా వైర‌స్ ఏకంగా జంతువుల్లో కూడా వ్యాపించ‌డం మొద‌లైంద‌నే ఆందోళ‌న క‌లిగిస్తోంది.

#Corona #Deer #Corona Animal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు