అమెరికాలో హై అలెర్ట్....కరోనా ఫోర్త్ వేవ్..ఒక్క రోజులో 85 వేల కేసులు...

అగ్ర రాజ్యాన్ని ఓ కుదుపు కుదిపేసిన కరోనా మహమ్మారి మరో సారి తన ప్రభావాన్ని ఫోర్త్ వేవ్ తో మళ్ళీ చూపించనుందా అంటే అవుననే అంటున్నారు నిపుణులు.చాప కింద నీరులా అమెరికాలో కరోనా ఫోర్త్ వేవ్ విస్తరిస్తోందని అమెరికన్స్ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

 Corona Alert America-TeluguStop.com

గతంలో కంటే కూడా ఇది అత్యంత ప్రభావవంతంగా ఉండనుందని అంటున్నారు.అయితే ఈ ఫోర్త్ వేవ్ లో ఎలాంటి లక్షణాలు కనిపించనున్నాయి.

ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అతిపెద్ద హాట్ టాపిక్ గా మారింది.

 Corona Alert America-అమెరికాలో హై అలెర్ట్….కరోనా ఫోర్త్ వేవ్..ఒక్క రోజులో 85 వేల కేసులు…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అమెరికాలో కరోనా ఎంట్రీ ఇచ్చిన తరువాత రోజు రోజుకు కేసుల సంఖ్య వెలతో మొదలయ్యి లక్షలు దాటింది.

ప్రస్తుతం అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 3 కోట్ల పైమాటే ఇక కరోనాతో చనిపోయిన వారి సంఖ్య దాదాపు 6 లక్షలకు చేరువలో ఉంది.కరోనా వ్యాక్సిన్ వేసుకోవడం, మాస్క్ లు ధరిస్తూ సామాజిక దూరం పాటించడం కారణంగా ఈ మధ్య కాలంలో కేసుల సంఖ్య తగ్గినట్టుగా అనిపించినా ఒక్క సారిగా నిన్నటి రోజున కరోనా కేసుల సంఖ్య 85 వేలుగా నమోదు అవడంతో వైద్య నిపుణులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

గత వారంలో కరోనా కేసుల సంఖ్య 64 వేలు నమోదు కాగా అప్పటి కి ఇప్పటికి దాదాపు 21 శాతం కేసులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వైద్య నిపుణులు.

అమెరికా వ్యాప్తంగా కొత్త రోగుల సంఖ్య పెరగడంతో అమెరికన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.తాజా పరిణామాలు చూస్తుంటే కొత్త వైరస్ ప్రభావామే ఈ కేసులు పెరగడానికి ప్రధాన కారణమనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.కరోనా ప్రభావం తగ్గిందని, వ్యాక్సిన్ వేసుకున్నాము అనే నిర్లక్ష్య ధోరణితో కొందరు జాగ్రత్తలు పాటించకపోవడం వలనే కేసుల సంఖ్య అమాంతం పెరిగిందని, కొత్త వేవ్ ను దృష్టిలో పెట్టుకుని అయినా జాగ్రత్తలు పాటిస్తూ టీకా తప్పనిసరిగా వేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

#Americans #CoronaFourth #Covid Vaccine #America #Corona Cases

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు