సుప్రీంకోర్టు పై పంజా విసిరిన కరోనా.. నేటి నుంచి విచారణలన్నీ ఇలాగే.. ?

ప్రస్తుతం కరోనా వల్ల దేశంలో ఏం జరుగుతుందో తెలియని అయోమయ పరిస్దితుల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటున్నారట.కరోనా ఇంతలా వ్యాప్తి చెందుతున్న గానీ లాక్‌డౌన్ మాత్రం విధించమని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పేర్కొన్న విషయం తెలిసిందే.

 Corona Agitation In The Supreme Court-TeluguStop.com

ఇక ప్రజల బ్రతుకులు అయితే ఈ సమయంలో మరీ దారుణంగా ఉన్నాయి.ఎందుకంటే కరోనా ఏ వైపు నుండి దాడిచేస్తుందో అర్ధం కానీ స్దితి ప్రస్తుతం నెలకొంది.

ఇదిలా ఉండగా దేశ సర్వోన్నత న్యాయస్థానంపై కరోనా తన పంజా విసిరింది.కొవిడ్ బారిన సుప్రీం కోర్టులో పనిచేస్తున్న వారిలో 50 శాతం సిబ్బందికి పైగా పడినట్లుగా సమాచారం.

 Corona Agitation In The Supreme Court-సుప్రీంకోర్టు పై పంజా విసిరిన కరోనా.. నేటి నుంచి విచారణలన్నీ ఇలాగే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు వర్గాలు నేటి నుంచి విచారణలన్నీ వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని వెల్లడించాయి.అంతే కాకుండా కోర్టు ప్రాంగణాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని నిర్ణయించుకున్నారట.

ఇక ఈ విషయంలో స్పందించిన ఒక న్యాయమూర్తి సుప్రీం కోర్టులో నాతో పని చేస్తున్న చాలా మంది సిబ్బంది, క్లర్కులు, లాయర్లు కరోనా బారిన పడ్డారని కాబట్టి నిర్లక్ష్యం ఏమాత్రం తగదని వెల్లడించారు.

#Agitation #COVID Positive #Coronavirus #Supreme Court #Staff Test

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు