కరోనా కలకలం.. 26 మంది విద్యార్థులకు టెస్ట్ చేస్తే 10 మందికి పాజిటివ్ 

విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మున్సిపల్ పరిధిలో 8వ వార్డు లో గల పురపాలక ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న 10మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ నిర్దారణ  కావడం కలకలం రేపుతోంది.పాఠశాలలో ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు కోవిడ్ మార్గదర్శకాలలో భాగంగా జయప్రకాష్ పురపాలక పాఠశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.

 Corona Agitation 26 Students Are Tested 10 Will Be Positive , Coroan , Corona Ca-TeluguStop.com

ఆ క్లాస్ లో మొత్తం 26 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో 10 మందికి కరోనా పాజిటివ్ అని స్థానిక అధికారులు ధ్రువీకరించారు.

దీంతో విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకు పరీక్ష నిర్వహణ వేగవంతం చేశారు.

అదేవిధంగా కోవిడ్ ఆందోళన నేపథ్యంలో మున్సిపల్ అధికారులు వారం రోజులు సెలవు ప్రకటించారు.అలాగే మహా విశాఖ నగర పాలక సంస్థ 89వ వార్డు పరిధిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరుగురికి వైరస్ సోకింది.

ఈ నెల 23న విద్యార్థులకు కోవిడ్(covid) నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా పదోతరగతి చెందిన నలుగురిక 6, 9 చదువుతున్న ఒక్కొక్కరికి పాజిటివ్ వచ్చినట్లు బుధవారం తెలిసింది.రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 1601 కరోనా కేసులు నమోదయ్యాయని, 16 మంది మరణించారన వైద్య శాఖ బుధవారం వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube