దేశంలో కరోనా @ 96,424 కేసులు !  

Corona Cases Increased in India,india, corona, positive cases, deaths - Telugu Corona, Deaths, India, Positive Cases

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది.నిత్యం వేలలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి.

TeluguStop.com - Corona Active Cases India

ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలను కోల్పోయారు.మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు.తాజాగా గడిచిన 24గంటల్లో కరోనా కేసుల సంబందించిన హెల్త్ బులిటెన్ ను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ శాఖ విడుదల చేసింది.

TeluguStop.com - దేశంలో కరోనా @ 96,424 కేసులు -General-Telugu-Telugu Tollywood Photo Image

దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 96,424 కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి.దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,14,678కు చేరుకుంది.ఇక దేశంలో మొత్తం 10,17,754 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వెల్లడించారు.అంతేకాకుండా 10,17,754 మంది ఈ మహమ్మారి బారి నుండి సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని ఇంటికి చేరుకున్నారు.

అయితే దేశంలో గడిచిన 24 గంటల్లో 1174 మంది కరోనా బారినపడి మృతి చెందారు.దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 84,372కి చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ శాఖ వెల్లడించింది.

ఇక దేశంలో కరోనా కేసులు 60 శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు.ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో 5 వేలలోపే కేసులు యాక్టివ్ ఉన్నట్లు తెలిపింది.

ప్రస్తుతం దేశంలో కరోనా మరణాల రేటు కూడా పెరిగిందని తెలిపారు.దేశ‌వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 10,06,615 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేసినట్లు భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి తెలిపింది.

#India #Corona #Deaths #Positive Cases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Active Cases India Related Telugu News,Photos/Pics,Images..