దేశంలో కరోనా @ 54,00,602 కేసులు..!  

Corona, positive cases,deaths, india - Telugu Corona, Deaths, India, Positive Cases

దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి.రోజూ 90 వేలకు తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతూనే ఉన్నాయి.

TeluguStop.com - Corona 5400602 Cases In The Country

దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.సామాన్య ప్రజల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలకు ఈ వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నా.రికవరీ రేటు కూడా అధికంగానే ఉందని ఆరోగ్య శాఖ తెలుపుతోంది.

TeluguStop.com - దేశంలో కరోనా @ 54,00,602 కేసులు..-General-Telugu-Telugu Tollywood Photo Image

ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తోంది.ఎప్పటిలాగే బయటకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం, శానిటైజర్ రాసుకోవడం, సామాజికదూరం పాటించాలని అంటున్నారు.

ఇలా చేస్తే మీరు కరోనా బారిన పడరని వైద్యులు అంటున్నారు.కరోనాపై ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ కరోనా హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది.గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 92,605 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకు మొత్తంగా నమోదైన కేసుల సంఖ్య 54,00,620కి చేరింది.నిన్న ఒక్కరోజే 1,133 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా.

వీరి సంఖ్య 86,752కి చేరింది.ప్రస్తుతం దేశంలో 10,10,824 యాక్టివ్ కేసులు ఉన్నాయని, ఇప్పటివరకూ దేశంలో 43,03,044 మంది కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 12,06,806 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించామని, సెప్టెంబర్ 19వ తేదీ వరకూ మొత్తంగా 6,36,61,060 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.రికవరీ రేటు అధికంగా ఉండని ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని, కరోనాకు పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ వచ్చేంతవరకూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

#Deaths #Corona #India #Positive Cases

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona 5400602 Cases In The Country Related Telugu News,Photos/Pics,Images..