ప్రజలకు శుభవార్త.. 300 రూపాయల మందులతో కరోనా నయం..!

గడిచిన ఆరు నెలల నుంచి దేశ ప్రజలు కరోనా మహమ్మారి విజృంభణ వల్ల పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.ప్రైవేట్ ఆస్పత్రుల్లో కరోనాకు చికిత్స చేయించుకోవాలంటే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

 Special Officer Covid 10 Prescription Goes Viral In Social Media-TeluguStop.com

అయితే కేవలం 300 రూపాయలతో కరోనాను నయం చేయవచ్చని ఏపీ కరోనా కంట్రోల్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ సి.ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు.అయితే అందరికీ ఈ మందులతో నయం చేయలేం కానీ స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లకు ప్రయోజనం చేకూరుతుందని అన్నారు.

కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నవాళ్లు వైరస్ నిర్ధారణ అయిన తరువాత ఈ మందులు వాడితే సరిపోతుందని.

ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి తప్పనిసరిగా చికిత్స చేయించుకోవాల్సిన అవసరం ఉండదని అన్నారు.అయితే ఈ ట్యాబ్లెట్లను వాడే కరోనా రోగుల ఆక్సిజన్ లెవెల్స్ 93 శాతం కంటే ఎక్కువగా ఉండాలని.

వాళ్లు మాత్రమే 300 రూపాయల మెడికల్ కిట్ తీసుకోవాలని పేర్కొన్నారు.

అయితే మందులు వాడినా ఆరోగ్య సమస్యలు కనిపిస్తే వెంటనే 104 నంబర్ కు కాల్ చేసి చికిత్స చేయించుకోవాలని తెలిపారు.

అయితే ఈ 300 రూపాయల మెడికల్ కిట్ మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలను సైతం ఆకర్షిస్తోంది.పాండిచ్చేరి సీఎం వి.నారాయణస్వామి ప్రభాకర్ రెడ్డిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదించి 300 రూపాయల మెడికల్ కిట్ కు సంబంధించిన వివరాలను తెలుసుకుంది.

పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ప్రభాకర్ రెడ్డి 300 రూపాయల మందుల గురించి, ఆ మందుల పనితీరు గురించి పాండిచ్చేరి సీఎంకు వివరించారు.

దీంతో నారాయణస్వామి పాండిచ్చేరిలో కూడా ఈ మందుల పంపిణీ జరిగే విధంగా చర్యలు చేపడుతున్నారు.ఎవరిలోనైనా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే ఫలితం వచ్చే వరకు కూడా ఈ మందులను వాడితే మేలని ప్రభాకర్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో 300 రూపాయల మెడికల్ కిట్ వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube