ఎట్టకేలకి కరోనాపై దర్యాప్తుకి అంగీకరించిన చైనా

ప్రపంచాన్ని తీవ్ర భయాందోళనకి గురి చేస్తున్న కరోనా వైరస్ సహజసిద్ధంగా పుట్టింది కాదని, ఇది మనవ ప్రయోగం ద్వారా ల్యాబ్ లో సృస్టించబడింది అంటూ పలు దేశాలు, శాస్త్రవేత్తలు చైనాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.అయితే చైనా ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలని ఖండిస్తూ వస్తుంది.

 Cornered China Agrees To Inquiry Into Corona Virus Origin, Corona Effect, Lock D-TeluguStop.com

ఇది సహజంగా పుట్టింది అంటూ నమ్మించే ప్రయత్నం చేస్తుంది.అయితే కరోనా సహజంగా పుట్టింది అని చైనా చెబుతున్న ప్రపంచ దేశాలన్నీ ఆ దేశం వైపు అనుమానంగానే చూస్తున్నాయి.

దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి.అన్ని దేశాలని అతలాకుతలం చేస్తున్న కరోనా చైనాలోని వూహాన్ పట్టణం దాటి వెళ్లకపోవడం పెద్ద అనుమానంగా ఉంది.

అలాగే సహజంగా పుట్టింది అనడానికి సరైన ఆధారాలు కూడా లేవు.ఈ వైరస్ ఏ పట్టణంలో పుట్టిందో అదే పట్టణంలో చైనా వైరస్ లపై ప్రయోగాలు చేస్తున్న వైరాలజీ ల్యాబ్ ఉంది.

ఈ కారణంగానే అన్ని దేశాలు చైనా వైపు వేలు చూపిస్తున్నాయి.

ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తుకు చైనా ఎట్టకేలకు అంగీకరించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిపై ప్రభావం చూపిన కరోనా బయటపడినప్పుడు చైనా ఎంతో బాధ్యతతో వ్యవహరించిందని చెప్పారు.ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు తాము బహిరంగంగా పంచుకున్నామని అన్నారు.

కరోనాపై దర్యాప్తుకు చైనా ముందుకు రావాలంటూ యూరోపియన్ యూనియన్ రూపొందించిన తీర్మానానికి 100కు పైగా దేశాలు మద్దతు పలికాయి.దీనిపై జిన్ పింగ్ స్పందిస్తూ, ప్రపంచ స్పందన మేరకు సమగ్ర సమీక్ష కోసం చైనా మద్దతు ఇచ్చిందని చెప్పారు.

అయితే, కరోనాపై ప్రపంచం పట్టు సాధించిన తర్వాత సమీక్ష ప్రక్రియను ప్రారంభిస్తే బాగుంటుందని అన్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రధానమని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube