రిమ్స్ ఆసుపత్రి నుంచి పారిపోయిన 10 మంది కరోనా పేషేంట్స్

ఆదిలాబాద్ జిల్లా లో కలకలం రేగింది.జిల్లా లోని రిమ్స్ ఆసుపత్రి నుంచి 10 మంది కరోనా పేషేంట్స్ పరార్ అవ్వడం తో అక్కడ ప్రజలు పరేషాన్ అవుతున్నారు.

 10 Corna Patients Missing In Rims Hospital, Cornavirus, Adhilabadh, Rims Hospita-TeluguStop.com

ఇటీవల ఒక రోగి అక్కడ వసతులు సరిగా లేవంటూ ఆసుపత్రి నుంచే వీడియో ద్వారా అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే.ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా కూడా మారింది.

అయితే కొద్దీ రోజులు తరువాత ఇప్పుడు తాజాగా 10 మంది కరోనా పేషేంట్స్ ఆసుపత్రి నుంచి పరార్ అవ్వడం తో అక్కడి ప్రజల్లో భయాందోళనలు మొదలయ్యాయి.తప్పించుకున్న వారిలో 6 కి ఇంకా కరోనా పాజిటివ్ ఉన్నట్లే అధికారులు చెబుతున్నారు.

అయితే అక్కడ భోజనం మాత్రమే కాకుండా మూత్ర శాలలు కూడా సరిగా లేవని కనీస వసతులు కూడా కల్పించడం లేదు అంటూ అక్కడి రోగులు వాపోతున్నారు.అయితే ఉన్నతాధికారులు కూడా ఏమీ పట్టించుకోకపోవడం తో మరికొద్ది రోజులు ఆసుపత్రిలోనే ఉంటే మరింత అనారోగ్యం పాలవుతాం అంటూ భావించిన 10 మంది రోజులు ఆసుపత్రి నుంచి పారిపోవడం కలకలం రేపింది.

అయితే ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఇటీవల వారు చేసిన వీడియో ద్వారా అర్ధం అవుతుంది.ఉన్నతాధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడం తో కరోనా రోగులు పరార్ అయినట్లు తెలుస్తుంది.

అయితే దీనిపై ఆసుపత్రి యాజమాన్యం మాత్రం అలాంటిది ఏమి లేదని, బక్రీద్ కారణంగా ముగ్గురు అనుమతి తీసుకొనే బయటకు వెళ్లారని,మరో ముగ్గురు మాత్రం ఎలాంటి అనుమతి లేకుండా వెళ్లినట్లు చెప్పుకొస్తుంది.అయితే ఆ ముగ్గురిని తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నట్లు వారు వెల్లడించారు.

అయితే రిమ్స్ ఆసుపత్రిలో కనీస అవసరాలు కూడా లేవని,కనీసం పేషేంట్స్ ను సరిగా చూసుకొనే వారు కూడా లేరంటూ అక్కడి రోగులు గత వారం రోజులుగా వాపోతున్నారు.ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నుంచి కరోనా రోగులు పారిపోయినట్లు భావిస్తున్నారు.

అయితే అధికారుల మధ్య ఏర్పడిన సమన్వయ లోపం కారణంగానే ఇలాంటి పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube