క్యా’కరోనా’ : మరో మూడు నెలలు ఇంతేనా ?  

Corna Virus India Lock Down Three Months Lock Down Corona Virus Covid 19 - Telugu Corona Virus In India, India Lock Down, Indian President, Lock Down In April 14th, Narendra Modi, Three Emi \"s Post Pone, Three Gas Sylinders, Three Months Lock Down

ఏం కరోనా ఏంటో తెలియదు కానీ, సామాన్య జనాలు ఏం కొనే పరిస్థితి, ఏం తినే పరిస్థితి లేదు.సర్వ వ్యవస్థలు అతలాకుతలం అయిపోయాయి.

 Corna Virus India Lock Down Three Months Lock Down Corona Virus Covid 19

అన్ని రంగాలను ఈ కరోనా వైరస్ కుదేలు చేసేసింది.అంతేకాదు ఈ కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు ఉదృతం అవుతున్న నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళనలో ఉన్నారు.

ప్రస్తుతం ఈ కరోనా వైరస్ ను కట్టడిచేసే మందులు ఏవి అందుబాటులోకి రాకపోవడంతో తక్షణ నివారణ చర్యల్లో భాగంగా ప్రజలందరూ సామాజిక దూరం పాటించే విధంగా ప్రభుత్వాలు, చర్యలు తీసుకున్నాయి.ఈ నేపథ్యంలోనే సరిగ్గా వారం క్రితం లాక్ డౌన్ అంటూ కేంద్రం ప్రకటించింది.

క్యా’కరోనా’ : మరో మూడు నెలలు ఇంతేనా -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

ఆ ఒక్క రోజు తో కాస్త పరిస్థితి మెరుగుపడుతుందని ప్రజలు కూడా పూర్తిస్థాయిలో సహకరించారు.అయితే ఆకస్మాత్తుగా మార్చి 31వ తేదీ వరకు ఇదే పరిస్థితి తప్పదంటూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునివ్వడంతో ఒక్కసారిగా అందరిలోనూ కలకలం రేగింది.

పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో నే ఈ విధంగా లాక్ డౌన్లోడ్ ప్రకటించారని అందరూ భావించారు.ఇంతలోనే ఏప్రిల్ 14 వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, అప్పటివరకు కర్ఫ్యూ కొనసాగుతోంది అంటూ కేంద్రం ప్రకటించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.అయితే అప్పటి వరకు బయటకు వెళ్లకపోతే జనాల పరిస్థితి ఏంటి అని ప్రశ్న కూడా జనాల్లో కలుగుతోంది.దీనికి పరిష్కారంగా కేంద్రం అకౌంట్లో డబ్బులు, ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలెండర్లు, మూడు సార్లు నిత్యావసరాలు ఉచితంగా ఇవ్వడం, మూడు నెలలపాటు ఈఎం ఐ లు వాయిదా వేయడం ఇవన్నీ పరిశీలిస్తే మరో మూడు నెలలపాటు ఇదే పరిస్థితి కొనసాగించాలని కేంద్రం భావిస్తుందా అనే అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది.

విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారానే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువ అయ్యింది.జనవరి నుంచి ఇప్పటి వరకు 15 లక్షల మంది భారత్ లో ప్రవేశించినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యం లో వైరస్ ఎవరికీ ఉందో ? ఎవరు ఎవరికీ వ్యాపింపజేశారు అనేది తెలుసుకోవడం చాలా కష్టమైన పనిగా మారింది.అందుకే దశల వారీగా మూడు నెలల పాటు ప్రజలను ఈ విధంగా కేంద్రం కట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునే విధంగా కూడా కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..