అద్బుతమైన మొక్క జొన్నను మనం ఇలా వృదా చేస్తున్నాం.. అక్కడ మాత్రం పూర్తిగా ఇవే తింటున్నారు

మొక్కజొన్నను ఇండియాలో అత్యధికంగా పండిస్తారు.తెలుగు రాష్ట్రాల్లో కూడా మొక్క జొన్న పంట అధికంగా సాగు చేయడం జరుగుతుంది.

 Corn Is Very Healthy Food For Pregnantwomen-TeluguStop.com

అయితే ఇండియాలో పండిన మొక్క జొన్నలో దాదాపు 90 శాతంకు పైగా మొక్క జొన్నలు కోళ్లకు మరియు పాడి పశువులకు దానాగా ఉపయోగిస్తున్నారు.కేవలం 10 శాతం మాత్రమే మనుషులు తింటున్నారు.

మొక్క జొన్నల్లో ఉన్న అద్బుత పోషకాలు మరియు లవణ గుణాల వల్ల మనుషులకు చాలా ఉపయోగాలున్నాయి.అందుకే మొక్క జొన్నను ఇండియాలో కంటే ఇతర దేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

అద్బుతమైన మొక్క జొన్నను మనం ఇ�

ఇండియాలో పాప్‌ కార్న్‌ వంటి స్నాక్స్‌ గా మాత్రమే మొక్కజొన్నలను ఉపయోగిస్తున్నారు.కాని విదేశాల్లో వివిధ పదార్థాల్లో మొక్క జొన్నలను వాడుతూ ఉంటారు.తాజాగా మొక్క జొన్న గురించిన పరిశోదనలో పలు ఆసక్తికర విషయాలను శాస్త్రవేత్తలు నిర్ధారించారు.మొక్కజొన్నలో క్యాన్సర్‌ రాకుండా ఉండే ఔషద గుణం ఉందట.మొక్కజొన్నలో ఉన్న పలు గుణాల కారణంగా పలు అనారోగ్య సమస్యలు కూడా నివారించబడతాయని వారు ప్రయోగాత్మకంగా నిరూపించారు.

అద్బుతమైన మొక్క జొన్నను మనం ఇ�

మొక్క జొన్నలో బీటా కెరోటిన్‌, విటమిన్‌ ఎ, విటమిన్‌ సి ఉన్నాయి.చర్మ సంబంధిత వ్యాధుల నుండి మొక్క జొన్నలు కాపాడతాయట.జింక్‌, పాస్పరస్‌, మెగ్నీషియం, ఐరెన్‌ ఇంకా పలు మినరల్స్‌ ఇందులో ఉన్నాయని కూడా వెళ్లడయ్యింది.

కీళ్ల నొప్పులతో బాధ పడే వారికి మొక్క జొన్నలు మంచి ఔషదంగా పని చేస్తాయి.రక్తహీనత మరియు బీపీకి సంబంధించిన సమస్యల నుండి కూడా ఉపశమనం కల్గిస్తాయి.

మొక్క జొన్నలు ఎక్కువగా తినడం వల్ల పేగకు సంబంధించిన క్యాన్సర్‌ మొదటి దశలో ఉంటే నివారణ సాధ్యం.ఇక గర్బినులకు కావాల్సిన ఫోలిక్‌ యాసిడ్‌ను సహజ సిద్దంగా మొక్క జొన్నలు అందిస్తాయి.

ఫోలిక్‌ యాసిడ్‌ కోసం రకరకాల ట్యాబ్లెట్లు వేసుకోనక్కర్లేదు.మొక్క జొన్నలు తింటే చాలని డాక్టర్లు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube