ఏం జరుగుతోంది డజన్లకొద్ది నేలరాలుతున్న పక్షులు

సినిమాల్లో చూపించినట్లుగా డజన్ల కొద్ది పక్షులు నేలరాలిపోవడం ఎక్కడైనా చూశారా.ఈ దృశ్యం ఆస్ట్రేలియాలో జరిగింది.

దక్షిణ ఆస్ట్రేలియాలోని అరుదైన పక్షుల్లో ‘కొరెల్లా’ జాతి ఒకటి.విపత్తులు, వేటగాళ్ల బారిన పడి ఇప్పటికే ఈ జాతి అంతరించే స్థితికి చేరింది.

ఏం జరుగుతోంది డజన్లకొద్ది నే�

ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం అడిలైడ్‌లోని ఒక ప్రైమరీ పాఠశాల సమీపంలో ఒక్కసారిగా కొరెల్లా పక్షులు నేలరాలాయి.వీటిని గుర్తించిన స్థానికులు కాస్పర్స్ బర్డ్ రెస్క్యూ టీమ్‌కి సమాచారం అందించారు.

ఏం జరుగుతోంది డజన్లకొద్ది నే�

రంగంలోకి దిగిన ఈ బృంద సభ్యులు వాటిని బతికించేందుకు ప్రయత్నించినప్పటికీ ఏ ఒక్క పక్షీ ప్రాణాలను రక్షించలేకపోయారు.ఇప్పటి వరకు దాదాపు 60కి పైగా పక్షులు చనిపోయాయని అధికారులు తెలిపారు.

పక్షులకు పెట్టిన ఆహారంలో ఎవరైనా విషం కలిపి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు.ఇది కూడా స్లో పాయిజన్ అయి వుండవచ్చని వారు అంచనా వేస్తున్నారు.కొన్ని వారాలుగా పక్షులకు ఇదే రకమైన ఆహారాన్ని అందించడం వల్ల ఇందులోని విషం నెమ్మదిగా ప్రభావం చూపిందని.అందుకు తగ్గట్టుగానే పక్షుల శరీర భాగాల్లో అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు వైద్యులు గుర్తించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube