వైరల్ వీడియో: కాపీ క్యాట్ అంటే ఇదే కాబోలు..!

సాధారణంగా ఇంట్లో ఎవరయినా చిన్న పిల్లలు ఉంటే వారు వారి తల్లి తండ్రులను చూసి వాళ్ళు ఎలా చేస్తే అలా అనుకరించడం మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాము.అమ్మ నాన్న ఏ పని చేసిన దానిని సేమ్ టూ సేమ్ కాపీ కొట్టి పిల్లలు చేయడం అనేది భలే ఫన్నీగా ఉంటుంది కదా.

 Copycat Is The Same Caboose Viral Latest, Viral News, Viral Video, Social Media-TeluguStop.com

అలాగే ఎగ్జామ్స్ లో కూడా అంతే కొంతమంది సరిగా చదవకపోతే ఎగ్జామ్ హల్ కి వెళ్ళేటప్పుడు స్లిప్స్ పెట్టుకుని వెళ్లడం వాటిని కాపీ కొట్టి మక్కి మక్కికి అనువదించడం లాంటి సంఘటనలను కూడా మనం చాలానే చూసాము కదా.అసలు ఇప్పుడు ఈ కాపీ గోల ఏంటి అని అనుకుంటున్నారా.కారణం ఉందండోయ్.

మన ఇంట్లో పిల్లలు ఎలా అయితే మనల్ని చూసి కాపీ కొట్టి మనం చేసిన పనులను చేస్తారో ఇక్కడ ఒక క్యాట్ కూడా కాపీ కొట్టి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అవుతోన్నది.ఈ పిల్లి చేసిన పని చూసి నెటిజన్లు అందరు పిల్లిని అభినందించకుండా ఉండలేకపోతున్నారు.కొంతమంది పెంపుడు జంతువుల కింద పిల్లులను కూడా పెంచుకుంటారనే విషయం మనకి తెలిసిందే.ఈ క్రమంలోనే ఒక మహిళ తనకు ఎంతో ఇష్టమైన పిల్లిని గారాబంగా పెంచుకుంటూ వస్తుంది.

ఈ క్రమంలో సదరు యజమానురాలు తన తలని దువ్వెనతో దువ్వుకోవడం క్యాట్ గమనించింది.

అలా యజమానురాలు ఎలా అయితే తన తలను దువ్వుకుంటుందో అచ్చం అలాగే పిల్లి కూడా దువ్వుకోవడానికి ప్రయత్నం చేసింది.యజమానురాలిలాగా పిల్లికి జుట్టు లేకపోయినా, దాని దగ్గర దువ్వెన లేకపోయినా గాని ఈ క్యాట్ ఆమె ఎలా చేస్తుందో అచ్చం అలానే చేసింది.ఈ క్రమంలో పిల్లి ముఖంలో కనిపించిన ఎక్సప్రెషన్స్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఈ వీడియోను ఇప్పటికే లక్షల సంఖ్యలో నెటిజన్లు వీక్షించారు.

వీడియో చూసిన ప్రతి ఒక్కరు తమకి తోచిన కామెంట్స్ పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube