పుష్ప ఫస్ట్ సింగిల్‌పై కాపీ ఆరోపణలు.. మ్యూజిక్, స్టెప్స్ ఎక్కడ నుంచంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్ ఇండియా స్థాయిలో నటిస్తున్నటువంటి “పుష్ప” సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన.ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, పోస్టర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేలా చేశాయి.

 Pushpa , Aauarjun, Copy Allegations, Music,latest Tollywood News-TeluguStop.com

సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ స్మగ్లర్ గా ఒక లారీ డ్రైవర్ పాత్రలో మనకు కనిపిస్తారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో సందడి చేయనున్నారు.

ఇకపోతే ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన జతకట్టారు.

ఇదిలా ఉండగా ఆగస్టు 13వ తేదీ ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల చేశారు.

“దాక్కొ దాక్కొ మేక” అనే పాటను విడుదల చేయగా ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తుందని చెప్పవచ్చు.ఈ పాటలో అల్లు అర్జున్ చేసినటువంటి స్టెప్పులు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

ఈ క్రమంలోనే యూట్యూబ్లో మంచి వ్యూస్ దక్కించుకుంటూ దూసుకుపోతున్న ఈ పాట పై కాఫీ ఆరోపణలు తలెత్తాయి.ఈ పాటలో మాస్ స్టెప్పులతో అదిరిపోయే ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అల్లు అర్జున్ ఈ పాటకు మరింత అందం తీసుకువచ్చారు.

Telugu Aauarjun, Copy, Music, Pushpa-Movie

ఎంతో అద్భుతమైన ఈ పాటను చంద్రబోస్ రాయగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.ఐదు భాషలలో ఐదు మంది సింగర్స్ పాడిన ఈ పాటను తెలుగులో శివం అనే సింగర్ పాడారు.ఇక ఈ పాటకు ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య రూపొందించారు.ప్రస్తుతం యూట్యూబ్ లో దూసుకుపోతున్న ఈ పాట బ్యాగ్రౌండ్ మ్యూజిక్, స్టెప్పులను కాపీ చేశారనే ఆరోపణలు తలెత్తుతున్నాయి.

ఇందులో ఉన్నటువంటి బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గబ్బర్ సింగ్ సినిమాలో ఉన్న మ్యూజిక్ మాదిరిగానే ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.అదే విధంగా ఇందులో అల్లు అర్జున్ వేసే స్టెప్పులు మాస్టర్ సినిమా ద్వారా బాగా పాపులర్ అయిన వాతి కమింగ్ స్టెప్ లాగా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పుష్ప సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగిల్ అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకోవడంతో పాటు కాఫీ ఆరోపణలు తలెత్తడంతో చిత్ర బృందానికి ఇదొక తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube