ఆదిపురుష్ పరువు తీసిన యానిమేషన్ స్టూడియో.. మా పోస్టర్ కు కాపీ అంటూ?

ఆదిపురుష్ మూవీ టీజర్ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2వ తేదీన విడుదలైన నిమిషం నుంచి ఈ సినిమా గురించి జరుగుతున్న ట్రోలింగ్ అంతాఇంతా కాదు.అయితే తాజాగా ప్రముఖ యానిమేషన్ స్టూడియో ఆదిపురుష్ మూవీ పరువు తీసేసింది.

 Copy Allegations About Aadipurush Movie Details, Vanar Sen Animation, Adipurush-TeluguStop.com

ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ మూవీ 2023 సంవత్సరం జనవరి 12వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో విమర్శల నేపథ్యంలో మేకర్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

తాజాగా వానర్ సేన్ స్టూడియో ఆదిపురుష్ మేకర్స్ తమ వర్క్ ను కాపీ చేశారంటూ సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం గమనార్హం.తాము రూపొందించిన శివుడి పోస్టర్ ను ఆధారంగా చేసుకుని ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారని ఈ సంస్థ పేర్కొంది.

 Copy Allegations About Aadipurush Movie Details, Vanar Sen Animation, Adipurush-TeluguStop.com

ఇప్పటికే పలు వివాదాలలో చిక్కుకున్న ఆదిపురుష్ చిత్రయూనిట్ కు ఈ ఆరోపణలు తలనొప్పిగా మారతాయని చెప్పడంలో సందేహం అవసరం లేదు.

ఒరిజినల్ క్రియేటర్ కు గుర్తింపు ఇవ్వకపోవడం బాధాకరం అంటూ వానర్ సేన్ స్టూడియో కామెంట్లు చేయగా సదరు సంస్థ ఆరోపణలు నిజమేనని నెటిజన్లు సైతం అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం.దర్శకుడు ఓం రౌత్ పై సెలబ్రిటీలు సైతం ఘాటుగా స్పందిస్తున్నారు.ఆదిపురుష్ సినిమా విడుదలైన తర్వాత కూడా వివాదాలలో చిక్కుకోవడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

టీ సిరీస్ సంస్థ ఈ సినిమాను నిర్మించగా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోని మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఈ సినిమా తెరకెక్కడం ఈ సినిమాకు మైనస్ అయిందని చెప్పవచ్చు.ఆదిపురుష్ సినిమా విషయంలో వినిపిస్తున్న నెగిటివ్ కామెంట్లకు సంబంధించి మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.నెగిటివ్ ట్రోల్స్ నేపథ్యంలో ఈ సినిమాకు ఏ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందో చూడాల్సి ఉంది.

Copy Allegations About Aadipurush Movie Details, Vanar Sen Animation, Adipurush Poster, Copied Poster, Adipurush Copied Poster, Director Om Raut, Hero Prabhas , Kriti Sanon, Prabhas Adipurush - Telugu Adipurushcopied, Copied Poster, Om Raut, Prabhas, Kriti Sanon, Vanar Sena #TeluguStopVideo #Shorts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube