ఆ కంటెంట్ ను... భారీ స్థాయిలో తొలిగించిన ఫేస్‌బుక్ !  

Contrversy Cuntent Delate By Facebook-

Facebook is well-known in social media, and is constantly introducing some innovative futures for their customers' convenience. At the same time, even on the controversial issues ... the same level of security measures. Freshly paid special attention to removing controversial content on Facebook. The company's ownership of the 1.4 crore content that it considered to be violent has already been cleared by Facebook. Facebook has taken action on 90.4 lakh content posted between April and June of this year. Most of the new technology is being used.

.

..

..

..

సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఫేస్‌బుక్ ఎప్పటికప్పుడు తమ వినియోగదారుల సౌకర్యార్థం ఏదో ఒక వినూత్న ఫ్యూచర్స్ ప్రవేశపెడుతూనే ఉంది. అదే సమయంలో వివాదాస్పద విషయాలపైనా కూడా … అదే స్థాయిలో రక్షణ చర్యలు తీసుకుంటూనే ఉంది. తాజాగా. ఫేస్‌బుక్ లో వివాదాస్పద కంటెంట్ తొలిగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. హింసాత్మకంగా ఉందని భావించిన 1.4 కోట్ల కంటెంట్‌ను ఇప్పటికే ఫేస్‌బుక్ నుంచి తొలగించినట్టు ఖరారు చేసింది ఆ సంస్థ యాజమాన్యం. ఈ ఏడాది ఏప్రిల్, జూన్ నెలల మధ్య పోస్ట్ చేసిన 90.4 లక్షల కంటెంట్‌పై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్. ఇందుకోసం ఎక్కువగా సరికొత్త టెక్నాలజీనే వాడుతున్నట్టు పేర్కొంది..

ఆ కంటెంట్ ను... భారీ స్థాయిలో తొలిగించిన ఫేస్‌బుక్ ! -Contrversy Cuntent Delate By Facebook

ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్న 99 శాతం కంటెంట్ మొత్తాన్ని ఫేస్‌బుక్ నుంచి తొలగించినట్టు గ్లోబల్ హెడ్ ఆఫ్ పాలసీ మేనేజ్‌మెంట్ హెడ్ మోనికా బిక్కెర్ట్ తెలిపారు. ఈ కంటెంట్ గుర్తించేందుకు సరికొత్త టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని, ఇకపై ఫేస్‌బుక్ ఖాతాదారులు ఎవ్వరూ ఇలాంటి కంటెంట్ పోస్ట్ చేయకుండా ఈ టెక్నాలజీ నియంత్రిస్తుందని వివరించారు.