ముదిరిన వివాదం : సిద్దార్ధారెడ్డీ... రాయలసీమ రాజకీయాలొద్దు !

యువ నాయకుడుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ( శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి( Chairman Baireddy to Siddhartha Reddy ) ఈ రోజు చేదు అనుభవం ఎదురయింది.ఏపీ క్రీడా సంఘాల సమావేశం ఈరోజు రచ్చ రచ్చగా ముగిసింది.

 Controversy Siddharth Reddy Don't Get Involved In Rayalaseema Politics , Saap, S-TeluguStop.com

బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ సభ్యుడు కేపీ రావు మధ్య వివాదం చోటుచేసుకుంది.విజయవాడలో మంత్రి రోజా సమక్షంలో ఏపీ క్రీడా సంఘాల సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధితార సంస్థ (శాప్ ) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అన్ని స్పోర్ట్స్ అసోసియేషన్ల( Sports Associations ) సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.శాప్ సమావేశాలు జరుగుతుండగానే స్పీచ్ ల విషయంలో ఏపీ ఒలంపిక్ అసోసియేషన్, సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వివాదం చోటుచేసుకుంది.

వెంటనే దీనిపై స్పందించిన శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎక్కడ వివాదాలు పెట్టుకునేందుకు ఈ సమావేశాలు పెట్టలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.దీనిపై స్పందించిన ఏపీ ఒలంపిక్ అసోసియేషన్ సభ్యుడు కేపీ రావు( KP Rao ) ” హూ ఆర్ యూ అంటూ సిద్ధార్థ రెడ్డిని ప్రశ్నించారు.

Telugu Ap Cm Jaga, Ap, Ap Acadamy, Bai Siddardha, Roja, Olampicmember, Rk Roja,

రాయలసీమ రాజకీయాలు ఇక్కడ చేయొద్దంటూ సిద్ధార్థ రెడ్డిని ఉద్దేశించి అనడంతో, ఒక్కసారిగా సిద్ధార్థ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే సిద్ధార్థ రెడ్డి అనుచరులు, వివిధ అసోసియేషన్ల సభ్యులు కేపీ రావు పై ఆగ్రహం వ్యక్తం చేశారు.కేపీ రావుకి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.వెంటనే దీనిపై స్పందించిన మంత్రి రోజా రెండు వర్గాలను బుజ్జగించి వివాదానికి పులిస్టాప్ పెట్టారు.

దీంతో వెంటనే సిద్ధార్థ రెడ్డి పై విమర్శలు చేసిన కేపీ రావు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు.ఈ వ్యవహారంపై సిద్ధార్థ రెడ్డి స్పందించారు.అంతర్గతంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించుకునేందుకే అన్ని అసోసియేషన్లను తాము పిలిచామని , కానీ కొంతమంది కావాలని రెచ్చగొట్టాలని చూసారని, ఏపీలో స్పోర్ట్స్ సర్వస్నాశనం కావడానికి కారకులెవరో తనకు తెలుసునంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube