'అరవింద సమేత' సక్సెఫుల్ గా దూసుకెళ్తున్న టైంలో పెద్ద ట్విస్ట్..! ఆ సీన్లను తొలగించకుంటే సినిమా నిలిపివేస్తారంట.?  

Controversy Over Aravinda Sametha Movie In Social Media-

ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో విడుదలైన “అరవింద సమేత” సినిమా సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఇక వసూళ్ల వర్షం అయితే ఆగట్లేదు. ఈ ఫ్యాక్షన్ డ్రామా రిలీజైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లు(గ్రాస్) వసూలు చేసింది. అయితే ఈ సినిమాకు ఇప్పుడు ఓ సమస్య వచ్చి పడింది. ఈ సినిమాలో రాయలసీమకు సంబంధించిన పలు అభ్యంతరకమైన సీన్లు మాటలున్నాయని …వెంటనే వాటిని తొలగించాలని రాయలసీమ విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు హెచ్చరించారు. లేదంటే సినిమా ప్రదర్శను నిలిపివేస్తాం అని కూడా హెచ్చరించారు.

Controversy Over Aravinda Sametha Movie In Social Media-

Controversy Over Aravinda Sametha Movie In Social Media

హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో రాయలసీమ పోరాట సమితి నిర్వహించిన మీడియా సమావేశంలో పలు విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు మాట్లాడారు. ఈ సినిమా ద్వారా రాయలసీమలో కనుమరుగైన ఫ్యాక్షనిజాన్ని దర్శకుడు త్రివిక్రమ్ రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Controversy Over Aravinda Sametha Movie In Social Media-

గతంలో కూడా చాలా సార్లు తెలుగు సినిమాల్లో రాయలసీమ ను ఫ్యాక్షనిజం అని మాత్రమే చూపించారు అని ఫైర్ అయ్యారు. నిమాలో ఫ్యాక్షన్ సన్నివేశాలు యువతను తప్పుదారి పట్టించేలా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా సినిమాలోని ఈ సన్నివేశాలను తొలగించాలనీ, లేదంటే రాయలసీమలో అరవింద సమేత వీరరాఘవ ప్రదర్శనలను అడ్డుకుంటామని నేతలు హెచ్చరించారు.

మరి చిత్రబృందం ఆ సీన్లను తొలగిస్తుందో లేదో వేచి చూడాలి. గతంలో ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలు వచ్చిన ఇలా గొడవలు ఎప్పుడు కాలేదు. కానీ ఈ సారి ఎందుకో ఇలా.? Attachments area