కేసీఆర్, జగన్ మధ్య చెడిన స్నేహం? ఇదే ' సాక్షి '

కృష్ణా జలాలతో మొదలైన వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఇద్దరి స్నేహితుల మధ్య చిచ్చు పెట్టినట్లుగా కనిపిస్తోంది.తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ ఇద్దరికీ మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

 Ys Jagan Serious On Kcr, Krishna Water Issue, Apsrtc Buses , Telangana, Kcr, Ap-TeluguStop.com

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడానికి పరోక్షంగా ఎంతటి సహకారం అందించారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఎన్నికలకు ముందు ఆయన ఎన్నో రకాలుగా వైసీపీకి సహకారం అందించారు.

ఇక జగన్ సైతం ఆ కృతజ్ఞతను గుర్తుంచుకుని, ఏపీ తెలంగాణకు సంబంధించి విభజన సమస్యలు, ఉమ్మడి ఆస్తుల పంపకాల విషయంలోనూ, కేసీఆర్ నిర్ణయానికి మద్దతు తెలిపారు.ఇక అన్ని విషయాల్లోనూ, కేసీఆర్ జగన్ ఇద్దరు ఏకాభిప్రాయంతో ఉంటూ, ఒకరికి ఒకరు సహకరించుకుంటూ వచ్చారు.

ఇక జగన్ పూర్తిగా తన కంట్రోల్ లో ఉంటానని కేసీఆర్ కానీ కృష్ణా జలాల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఏర్పడింది.ఈ అంశంపై కేంద్రానికి సైతం ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం సైతం కేంద్రానికి ఫిర్యాదు చేయడంతో వీరి మధ్య వివాదం రేగింది.

దీంతో ఒక రాష్ట్రంపై మరో రాష్ట్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.పూర్తిగా లాక్ డౌన్ సడలింపు ఇచ్చినా, ఏపీ తెలంగాణలో ఇప్పటికీ ఆర్టీసీ రాకపోకలు జరగకపోవడానికి ఈ వివాదాలే కారణంగా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది.

Telugu Ap, Apsrtc Buses, Krishna, Perni Nani, Sakshi Paper, Telangana, Ys Jagan

ముఖ్యంగా ఏపీ బస్సులు తెలంగాణాలో తిరిగేందుకు తెలంగాణ ప్రభుత్వం రకరకాల కారణాలు చెబుతోందని, ఈ విధంగా కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని ఏపీ మంత్రులు కొంత మంది బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.తాజాగా తెలంగాణకు ఆర్టీసీ బస్సులు నడిపే విషయమై మీడియా వేసిన ప్రశ్నకు ఏపీ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ నే అడగాలంటూ చెప్పడం చూస్తుంటే, కావాలనే కేసీఆర్ ఆర్టీసీ రాకపోకలు అడ్డుకుంటున్నారనే విషయం అర్థమవుతోంది.ఇదిలా ఉంటే ఈ మధ్యనే స్వచ్ఛ అవార్డులలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం దక్కించుకుంది.

ఈ అవార్డు దక్కించుకోవడం ఇది మూడోసారి.

తెలంగాణ ప్రభుత్వం అవార్డు స్వీకరించే సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం అన్ని పత్రికలకు ప్రకటనలు భారీగా ఇచ్చింది.ఇందులో కేసీఆర్ కు బద్ధ శత్రువులుగా ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి లలో సైతం ప్రకటనలు ఇచ్చి, జగన్ కు సంబంధించిన సాక్షి పత్రికకు మాత్రం ప్రకటనలు ఇవ్వకపోవడంపై రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

జగన్ పై ఆగ్రహంతోనే ఈనాడు, ఆంధ్రజ్యోతి లకు ప్రకటనలు ఇచ్చి, సాక్షికి మాత్రం ఇవ్వకపోవడం చూస్తుంటే, జగన్ పై కేసీఆర్ తన ఆగ్రహాన్ని ఈ విధంగా చూపిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube