హీరోయిన్స్‌ మద్య వివాదం ఇలా ముగిసింది.. తలపొగరుకు సున్నిత సమాధానం  

Controversy Between Heroines Has Completed-

బాలీవుడ్‌ ఫైర్‌ బ్రాండ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌ మరోసారి తన నోటి దురుసును ప్రదర్శించింది.పెద్ద ఎత్తున స్టార్స్‌ గురించి బ్యాడ్‌ కామెంట్స్‌ చేసే కంగనా తాజాగా ఆలియా భట్‌ను టార్గెట్‌ చేసింది.

Controversy Between Heroines Has Completed--Controversy Between Heroines Has Completed-

ఆలియా భట్‌ నటనతో తన నటనను పోల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.మణికర్ణిక చిత్రంలోని తన నటనకు ఆలియా నటించిన గల్లీ బాయ్‌ చిత్రంలోని నటనకు పోలిక పెట్టడం ఏంటీ అంటూ మండిపడింది.స్టార్‌ కిడ్స్‌ అవ్వడం వల్ల వారిని నెత్తిన ఎత్తుకోవడం మీడియా మానేయాలంటూ తీవ్ర ఆగ్రహంతో వ్యాఖ్యలు చేసింది.

Controversy Between Heroines Has Completed--Controversy Between Heroines Has Completed-

ఈ వ్యాఖ్యలకు మరే హీరోయిన్‌ అయినా కూడా ఖచ్చితంగా సీరియస్‌గా రియాక్ట్‌ అవ్వాలి.కాని ఆలియా భట్‌ మాత్రం స్నేహపూర్వగంగా స్పందించింది.వివాదం లేకుండా పరిష్కరించుకునే విధంగా మాట్లాడి అందరి దృష్టిని ఆకర్షించింది.ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సినీ వర్గాల్లో కూడా ఆమెపై ప్రశంసలు కురిసేలా చేస్తున్నాయి.

నా నటన గురించి కంగనా మాట్లాడటం ఆశ్చర్యంగా అనిపించింది.గతంలోనే నేను నటించిన ఒక చిత్రంను చూసిన ఆమె నా నటనపై ప్రశంసలు కురిపించింది.కాని ఇప్పుడు ఆమె అభినందనలు అందుకోలేక పోయాను.

ఆమె నుండి ప్రశంసలు దక్కించుకునేందుకు మరోసారి కష్టపడి పని చేస్తాను.తప్పకుండా ఈసారి ఆమెతో ప్రశంసలు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాను, ఆమె తనకు మంచి స్నేహితురాలు అంటూ చెప్పుకొచ్చింది.

మొత్తానికి కంగనా రనౌత్‌ తలపొగరు వ్యాఖ్యలకు ఆలియా భట్‌ సున్నిత వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిలో గుడ్‌ అనిపించుకుంది.ప్రస్తుతం ఈ అమ్మడు టాలీవుడ్‌లో రూపొందుతున్న చరణ్‌, ఎన్టీఆర్‌ల మల్టీస్టారర్‌ మూవీలో నటిస్తున్న విషయం తెల్సిందే.

ఈ చిత్రంకు సంబంధించిన షూటింగ్‌లో కూడా ఆలియా భట్‌ పాల్గొంది.ఇక పలు బాలీవుడ్‌ చిత్రాల్లో కూడా ఆలియా నటిస్తోంది.