వివాదాస్ప‌దం అవుతున్న పంజాబ్ సీఎం ఫొటో..

పంజాబ్ రాజ‌కీయాలు ఇప్పుడు ఎంత పాపుల‌ర్ అయిపోయాయో అంద‌రికీ తెలిసిందే.మొన్న‌టి వ‌ర‌కు సీఎంగా ఉన్న‌టువంటి కెప్టెన్ అమ‌రేంద‌ర్ సింగ్ రాజీనామాతో దేశ వ్యాప్తంగా పంజాబ్ రాజకీయాలు పాపుల‌ర్ అయిపోయాయి.

 Controversial Punjab Cm Photo Punjab Cm-TeluguStop.com

ఇక కొత్త సీఎంగా చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్ర‌మాణ స్వీకారం చేసిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న వార్త‌ల్లోనే ఉంటున్నారు.అంత‌కు ముందు ఆయ‌న ఎవ‌రో పెద్ద‌గా తెలియ‌క‌పోయినా ఇప్పుడు ఆయ‌న అనూహ్యంగా పంజాబ్‌కు బాస్ అయిపోయారు.

అయితే ఆయ‌న సీఎం అయిన తీరుపై ఇప్ప‌టికీ కాంగ్రెస్ మీద విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి.

 Controversial Punjab Cm Photo Punjab Cm-వివాదాస్ప‌దం అవుతున్న పంజాబ్ సీఎం ఫొటో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పుడు ఆయ‌న దిగిన మ‌రో ఫొటో మీద రాజకీయ వివాదం రాజుకుంది.

సీఎం చరణ్‌జిత్ సింగ్ తో పాటుగా పీసీసీ చీఫ్ సిద్ధూ, డిప్యూటీ సీఎంలు సుఖ్‌జిందర్ సింగ్, ఓపీ సోని లు క‌ల‌సి మంగ‌ళ‌వారం నాడు కొన్ని ముఖ్య‌మైన ప‌నుల నిమిత్తం వారంతా ప్రైవేట్ జెట్‌లో ఢిల్లీ పర్యటనకు బ‌య‌లు దేరి వెళ్లార‌ని తెలుస్తోంది.అయితే వీరు ఇలా ఢిల్లీకి వెళ్లేముందు ఆ ప్రైవేట్ జెట్ ద‌గ్గ‌ర దిగిన ఫొటో ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది.

కేబినెట్ లోకి కొత్త‌గా ఎవ‌రిని తీసుకోవాల‌నే దానిపై పార్టీ ఢిల్లీ పెద్దలతో మాట్లాడేందుకు వారు వెళ్లారు.

Telugu Charam Jith Singh, Delhi Tour, Pcc Chef Sidhu, Private Jet, Punjab Cm, Punjab Cm Photo, Sukh Gindher Singh, Viral Pic-Latest News - Telugu

కాగా వీరు దిగిన ఫొటోమీద ఇత‌ర పార్టీలు భ‌గ్గుమంటున్నారు.రాచరికపు పోకడలా వారి చేష్టులు ఉన్నాయంటూ శిరోమణి అకాలీదల్ నేత‌ల‌తో పాటుగా ఆమ్ ఆద్మీ నాయ‌కులు తీవ్ర స్థాయ‌లో విమ‌ర్శ‌లు చేశారు.ప‌క్క‌నే ఉండే ఢిల్లీకి పంజాబ్ నుంచి కేవలం 250 కిలో మీటర్లేన‌ని, ఆ మాత్రం దానికి ప్రైవేటు జెట్ ఉప‌యోగించ‌డం ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేయ‌డ‌మేనంటూ మండిప‌డుతున్నారు.

సాధారణ విమానాలు ఎన్నో ఉన్నా ఇలా ప్రైవేట్‌ జెట్ ఎందుకు వాడుతున్నారంటూ ప్రశ్నించారు.సామాన్యుల ప్రభుత్వమని చెప్ప‌డం పూర్తి అబ‌ద్ధ‌మంటూ విమ‌ర్శిస్తున్నారు.

#Punjab CM #Delhi #Private Jet #Pcc Chef Sidhu #Punjab CM

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు