సీతారామంపై స్పందించిన కాంట్రవర్సీ బ్యూటీ... జిందాబాద్ అంటూ కామెంట్స్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్వీన్ గా పేరు సంపాదించుకున్నారు నటి కంగనా.అయితే ఈమె ఏ విషయం అయినా ముక్కు సూటిగా మాట్లాడుతూ కుండలు బద్దలు కొట్టినట్టు ప్రశ్నించడం ఈమె నైజం.

 Controversial Beauty Who Responded To Sitaram Comments Saying Zindabad , Controversial Beauty , Sitaram,comments Zindabad, Dulquer Salmaan, Mrinal Thakur ,directed By Hanu Raghavapudi-TeluguStop.com

అవతల ఎలాంటి వారు ఉన్నారన్న విషయాన్ని పక్కన పెట్టి తనదైన శైలిలో తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్నటువంటి ఈమె నిత్యం బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజంపై పెద్ద ఎత్తున మండిపడుతుంటారు.

ఇలా నిత్యం హాట్ హాట్ గా ఉండే ఈమె తాజాగా సీతారామం సినిమా పై చేసిన కామెంట్స్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.

 Controversial Beauty Who Responded To Sitaram Comments Saying Zindabad , Controversial Beauty , Sitaram,comments Zindabad, Dulquer Salmaan, Mrinal Thakur ,directed By Hanu Raghavapudi-సీతారామంపై స్పందించిన కాంట్రవర్సీ బ్యూటీ#8230; జిందాబాద్ అంటూ కామెంట్స్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సీతారామం సినిమా ఆగస్టు 5వ తేదీ విడుదల అయ్యి సౌత్ ఇండస్ట్రీలో ఎంతో మంచి విజయం సొంతం చేసుకుంది.

ఈ క్రమంలోనే ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేయడంతో హిందీలో కూడా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇకపోతే తాజాగా ఈ సినిమాని కంగనా రనౌత్ చూశారని ఈమె ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

Telugu Zindabad, Controversial, Dulquer Salmaan, Mrinal Thakur, Sitaram-Movie

ఈ సందర్భంగా కంగనా స్పందిస్తూ చివరికి సీతారామం సినిమా చూసే సమయం దొరికింది.ఈ సినిమా చూస్తూ అనుభూతికి లోనయ్యాను చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ప్రేమ కథ ఇది.దర్శకత్వం స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. డైరెక్టర్ హనురాగవపుడికి తను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క క్రాఫ్ట్ విషయంలో ఎంతో అద్భుతమైన పనితీరు కనబరిచారు అంటూ తెలియజేశారు.

ఈ సినిమాలో ప్రతి ఒక్క నటీనటులు ఎంతో అద్భుతంగా చేశారు.ముఖ్యంగా మృణాల్ తన పాత్రలో ఒదిగిపోయి చేశారు.ఈ పాత్రకి ఈమె తప్ప మరెవరు ఇంత అద్భుతంగా చేయలేరని డైరెక్టర్ ముందే ఊహించి ఆమెని ఎంచుకున్నారు.మృణాల్ నిజమైన మహారాణి.

జిందాబాద్ ఠాకూర్ సాబ్.నీ రూలింగ్ మొదలైంది అంటూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube