రాష్ట్రాభివృద్ధికి సహకరించండి : కెనడాలోని ఎన్ఆర్ఐలను కోరిన పంజాబ్ అసెంబ్లీ స్పీకర్

కెనడాలోని పంజాబీ ఎన్ఆర్ఐలు రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్.ప్రస్తుతం కెనడా పర్యటనలో వున్న ఆయన.

 Contribute For Development Of Punjab: Assembly Speaker Kultar Sandhwan Asks Nris-TeluguStop.com

వాంకోవర్‌లోని పంజాబీ కమ్యూనిటీతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా కుల్తార్ మాట్లాడుతూ.

పంజాబీలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికెళ్లినా, తమ వ్యక్తిత్వం, కృషితో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారని ప్రశంసించారు.ఈ లక్షణాలు వారిని ఇతరులకు భిన్నంగా చేస్తాయని.

కెనడా అభివృద్ధికి పంజాబీలు కూడా చాలా వరకు దోహదపడ్డారని , అక్కడ సొంతంగా వ్యాపారాలను, పరిశ్రమలను స్థాపించారని కుల్తార్ కొనియాడారు.
ఇప్పుడు మాతృభూమి అభివృద్ధికి అలాంటి పాత్ర పోషించడం తమ బాధ్యతగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు.

పంజాబ్‌లోనూ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు.పంజాబీలు తమ మాతృభూమికి వేల మైళ్ల దూరంలో నివసిస్తున్నప్పటికీ .వారి ఆత్మ మాత్రం పంజాబ్‌లోనే నివసిస్తుందని సంధ్వాన్ పేర్కొన్నారు.ప్రతి పంజాబీ కూడా వీరి విజయాలను చూసి గర్వపడుతున్నారని.

ఈ నేపథ్యంలోనే జన్మభూమిలోని ప్రజల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకుంటారని కుల్తార్ ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే పంజాబ్‌లో తమ వెంచర్లను ప్రారంభించే వారికి అన్ని రకాలుగా సహాయం అందిస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు.

Telugu Assemblykultar, Bhagwant Mann, Canada, Punjabi Nri, Telugu Nris-Telugu NR

ఇకపోతే.ఎన్ఆర్ఐల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా ఫీల్డ్ ఆఫీసర్‌లను నోడల్ అధికారులుగా నియమించాలని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే.ఆప్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.సహాయ కమీషనర్ (గ్రీవెన్స్)కు సమాన సంఖ్యలో వున్న పోస్టులను రద్దు చేసి ‘‘ముఖ్యమంత్రి ఫీల్డ్ ఆఫీసర్‌ల’’ పేరిట 23 పోస్టులను ఏర్పాటు చేశారు.

పారదర్శకమైన ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను అందించడం వల్ల జిల్లా స్థాయిలోనే పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు.సీఎం కార్యాలయంతో నేరుగా కమ్యూనికేట్ చేయడంతో పాటు శాఖలు, జిల్లాల వారీగా సమన్వయం చేయగల ఈ అధికారులు .ఎన్ఆర్ఐలకు ఆదర్శ నోడల్ అధికారులుగా పేరు తెచ్చుకుంటారని భగవంత్ మాన్ ఆకాంక్షించారు.ఈ ఏర్పాటు ద్వారా ఎన్ఆర్ఐలు.

తమ సమస్యలన్నింటికీ సజావుగా, అవాంతరాలు లేని రీతిలో పరిష్కారాలను పొందుతారని భగవంత్ మాన్ అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube