Vijayasai Reddy : జగన్ ఆదేశాల మేరకే నెల్లూరు లోక్ సభ అభ్యర్థిగా పోటీ..: విజయసాయి రెడ్డి

ఏపీలో 99 శాతం హామీలను అమలు చేశామని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి( YCP MP Vijayasai Reddy ) అన్నారు.

రాష్ట్రంలో ఎవరి హయాంలో అభివృద్ధి ఎక్కువ జరిగిందో ప్రజలకు బాగా తెలుసని చెప్పారు.

అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమని పేర్కొన్నారు.సిద్ధం సభా వేదికగా సీఎం జగన్( CM Jagan ) మ్యానిఫెస్టోను ప్రకటిస్తారని తెలిపారు.

అదేవిధంగా సీఎం జగన్ ఆదేశాల మేరకే నెల్లూరు లోక్ సభ( Nellore Lok Sabha ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇక్కడే పుట్టి పెరిగానన్న విజయసాయిరెడ్డి గెలిచి ప్రజలకు సేవ చేస్తానన్నారు.వేమిరెడ్డి తనకు మంచి మిత్రుడని చెప్పారు.అయితే స్నేహం వేరు, రాజకీయం వేరని పేర్కొన్నారు.

Advertisement

జిల్లా మీద తనకు పూర్తిగా అవగాహన ఉందని తెలిపారు.రాజ్యసభ సభ్యులుగా ఉంటూ జిల్లాను అభివృద్ధి చేశానన్నారు.

ఈ క్రమంలోనే పార్టీకి, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు