ఈ సెంటిమెంట్ ప్రకారం బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే?  

Dethadi harika May Be Bigg Boss4 Winner, bigg Boss4, Dethadi harika, Nagarjuna, Fake Elimination, Rahul Sipligunj - Telugu Bigg Boss 4, Bigg Boss4, Dethadi Harika, Dethadi Harika May Be Bigg Boss4 Winner, Fake Elimination, Harika, Nagarjuna, Rahul Sipligunj

మిగతా షోలతో పోలిస్తే బిగ్ బాస్ షోకు ఒక ప్రత్యేకత ఉంది.ఇక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు.

TeluguStop.com - Contestant Harika May Be Bigg Boss 4 Season Winner

అందరి అంచనాలకు భిన్నంగా ఈ షో సాగుతుంటుంది.కొన్నిసార్లు ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగానే షో సాగినా బిగ్ బాస్ మాత్రం ఊహించని ట్విస్టులు ఇస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు.

కొన్నిసార్లు కంటెస్టెంట్లను, షో చూసే ప్రేక్షకులను బిగ్ బాస్ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాడు.

TeluguStop.com - ఈ సెంటిమెంట్ ప్రకారం బిగ్ బాస్ విన్నర్ ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

నిజానికి తెలుగులో గత బిగ్ బాస్ సీజన్లకు, ఈ బిగ్ బాస్ సీజన్ కు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి.

గత సీజన్లలో ఒకరిద్దరు మినహా అందరూ తెలిసిన సెలబ్రిటీలు ఉంటే ఈ సీజన్ లో ముగ్గురు, నలుగురు మినహా పరిచయం లేని సెలబ్రిటీలు ఉండటం గమనార్హం.బిగ్ బాస్ సీజన్ 4 లో ప్రస్తుతం గంగవ్వ, దేత్తడి హారిక, మోనాల్ గజ్జర్, నోయల్, అభిజిత్ అఖిల్ బలమైన కంటెస్టెంట్లుగా ఉన్నారు.

మిగిలిన వాళ్లు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది.దీంతో బిగ్ బాస్ డబుల్ ఎలిమినేషన్ పేరు చెప్పి హారికను ఫేక్ ఎలిమినేషన్ చేశాడు.

అయితే ఆ తర్వాత అది ఫేక్ ఎలిమినేషన్ అని చెప్పి హారికను ఇంట్లోకి పంపారు.మొదట ఎవరూ ఊహించని విధంగా హారిక ఎలిమినేట్ కావడంతో కంటెస్టెంట్లు సైతం ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.

తెలుగులో బిగ్ బాస్ ఇలా ఫేక్ ఎలిమినేషన్ చేయడం ఇదే తొలిసారి కాదు.
గత సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ ను ఫేక్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్ ఈ సీజన్ లో హారికను ఫేక్ ఎలిమినేషన్ చేశాడు.

అయితే గత సీజన్ లో ఫేక్ ఎలిమినేట్ అయిన రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు.దీంతో ఆ సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ హారిక ఈ సీజన్ కు విన్నర్ అయ్యే అవకాశం ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరి హారిక నిజంగానే విన్నర్ అవుతుందో లేదో తెలియాలంటే కొన్ని నెలలు ఆగాల్సిందే.

#Dethadi Harika #DethadiHarika #Nagarjuna #Bigg Boss4 #Harika

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Contestant Harika May Be Bigg Boss 4 Season Winner Related Telugu News,Photos/Pics,Images..