కరోనా కారణంగా దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఏ విధంగా పెరిగాయో తెలియంది కాదు.ఈ క్రమంలో పేద, దిగువ మధ్య తరగతి కుటుంబాలు అల్లాడిపోయాయి.
ఇప్పుడిప్పుడే సదరు కంపెనీలు ధరల పెంపు విషయంలో కాస్త వెనకడుగు వేసినట్టుగా కనబడుతోంది.ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగంలోని చాలా కంపెనీల నుంచి తాజాగా ఓ శుభవార్త అందింది.
గత 2 సంవత్సరాలలో చాలా కంపెనీలు ధరలను నిరంతరం పెంచినందున.ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు.
ఇపుడు ప్రజలకు కాస్తయినా ఊరట కలిగిద్దామని సదరు కంపెనీలు అభిప్రాయపడ్డాయట.
దాంతో త్వరలో వినియోగదారులకు మరింత ఊరట కలగనుంది ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అభిప్రాయపడింది.
గత 2 సంవత్సరాలలో ధరలు ఒకసారి చూసుకుంటే 20% కంటే ఎక్కువగా పెరిగాయని ఐసీఐసీఐ వెల్లడించింది.కన్స్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు దాదాపు 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ ఖర్చులతో పాటు RD ఖర్చులను పెంచడం, రకరకాల ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం, చిన్న, పెద్ద కంపెనీల నుంచి మార్కెట్ షేర్లను పొందేందుకు కమర్షియల్ స్కీమ్స్, వినియోగదారుల ఆఫర్లను పెంచడంలో పెట్టుబడి పెట్టడం చేయవచ్చని ఈ సందర్భంగా పేర్కొంది.

ఇక ప్రముఖ ఫుడ్ ఐటమ్స్ తయారీ కంపెనీ అయినటువంటి పార్లే ప్రొడక్ట్స్ సీనియర్ కేటగిరీ హెడ్ మయాంక్ షా కూడా వస్తువుల ధరల గురించి ఈ సందర్భంగా మాట్లాడారు.ప్రస్తుతం చాలా వస్తువుల ధరల 15-20% తగ్గినట్లు కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.అధిక ద్రవ్యోల్బణం కారణంగా మార్జిన్ల లాభాలు తగ్గిన FMCG కంపెనీలకు ధరల తగ్గుదల కొంత ఉపశమనం కలిగించిందన్నారు.ఇంకా రానున్న రోజుల్లో ఈ ధరలు మరింత తగ్గగలవు అని, మరలా పాత ధరలు అందుబాటులోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అన్నారు.