దేవుడా: హెయిర్ కట్ చేసినందుకు ఏకంగా 2 కోట్ల జరిమానా వేయించుకున్న సెలూన్..!

జుట్టు కత్తిరించడంలో సెలూన్ సిబ్బంది చేసిన నిర్లక్ష్యం కారణంగా హెయిర్ సెలూన్ యాజమాన్యం రెండు కోట్ల నష్టపరిహారం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఓ సెలూన్ కి.ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.

 Consumer Court Fines Two Crore Rupees For Cutting Models Hair Wrongly-TeluguStop.com

వివరాలు చూస్తే.ఢిల్లీలోని హెయిర్ సెలూన్ కు ఓ హెయిర్ ప్రొడక్ట్స్ మోడల్ ఆష్ణా రాయ్ హెయిర్ కటింగ్ చేసుకోవడానికి వెళ్ళింది.

అయితే ఆమె సెలూన్ సిబ్బందిని ‘ఫిక్స్’ స్టైల్ 4 అంగుళాలు మేరకు కత్తిరించాలని కోరింది.అయితే సెలూన్ సిబ్బందికి ఆమె చెప్పిన మాటలు వినిపించక నాలుగు అంగుళాల జుట్టును మాత్రమే మిగిల్చి మిగతా జుట్టును కత్తిరించేశారు.

 Consumer Court Fines Two Crore Rupees For Cutting Models Hair Wrongly-దేవుడా: హెయిర్ కట్ చేసినందుకు ఏకంగా 2 కోట్ల జరిమానా వేయించుకున్న సెలూన్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో మోడల్ ఆస్నా రాయ్ షాక్ కు గురయింది.వెంటనే సెలూన్ మేనేజ్మెంట్ కు ఆమె ఫిర్యాదు చేయగా వారు ఆమెకు హెయిర్ ట్రీట్మెంట్ ఉచితంగా చేశారు.

అయినా కూడా ఆ ట్రీట్మెంట్ కారణంగా ఆమె జుట్టు శాశ్వతంగా దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉండగా ఆస్నా రాయ్ తన అందమైన జుట్టుతోనే పెద్ద పెద్ద హెయిర్ కేర్ బ్రాండ్లకు మోడలింగ్ చేస్తోంది.

ఇప్పుడు హెయిర్ కట్ చేయడంతో ఆమెకు వచ్చే ఆఫర్లన్నీ కోల్పోయింది.దీంతో ఆమె జీవనశైలి మొత్తం మారిపోయిందని తీవ్ర ఆవేదనకు గురైంది.టాప్ మోడల్ కావాలనే ఆమె కల చెదిరిపోవడంతో ఆమె తీవ్రమైన మానసిక వేదనకు, ఒత్తిడికి గురి అయింది.తన పని పై దృష్టి పెట్టలేకపోయింది.

Telugu Consumer Court, Consumer Court Fines Saloon, Cutting Models Hair Wrongly, Fines Two Crore Rupees, Latest News, Model Ashna Roy, Social Media, Viral Latest, Viral News, Wrong Hair Cut-Latest News - Telugu

తన అందమైన జుట్టు కారణంగా వచ్చే మోడలింగ్ ఆఫర్లు రాకపోవడంతో, తన జీవనాధారం దెబ్బతిందని ఆమె కన్స్యూమర్ కోర్టులో హెయిర్ సెలూన్ యాజమాన్యం పై ఫిర్యాదు చేసింది.తనకు రూ.3 కోట్లు నష్ట పరిహారం చెల్లించాలని కోరింది.ఆమె ఫిర్యాదును పరిశీలించిన కన్స్యూమర్ కోర్ట్ సెలూన్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఆష్ణా జుట్టు కోల్పోయిందని నిర్ధారించి బాధితురాలికి 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, అది కూడా మొత్తం సొమ్ము బాధితురాలికి కేవలం 8 వారాలలో చెల్లించాలని ఆదేశించింది.

#Saloon #Crore Rupees #Models Wrongly #Ashna Roy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు