‘కానిస్టిట్యూషనల్ క్యారీ’ చట్టం: ఓక్లహోమాలో తుపాకులు స్వేచ్ఛగా తీసుకెళ్లొచ్చు

అమెరికాలో గన్ సంస్కృతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.సంతలో కూరగాయలు దొరికినట్లుగా అక్కడ తుపాకులు దొరుకుతాయి.

 Constitutional Carrygun Law In Oklahomatookeffect-TeluguStop.com

దీంతో అక్కడి ఉన్మాదులు పేట్రేగిపోవడం వేలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం గత కొన్నేళ్లుగా చూస్తూనే ఉన్నాం.కొందరు ఈ గన్ కల్చర్‌కు మద్ధతిస్తుంటే ఇంకొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు.

కాగా ఓక్లహోమాలో తుపాకులను తీసుకెళ్లడానికి రాజ్యాంగపరమైన రక్షణ లభించింది.

దీని ప్రకారం 21 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఎలాంటి అనుమతి లేకుండా తుపాకీని తమ వెంట ఉంచుకోవడానికి ఈ చట్టం అనుమతిస్తుంది.

ఒక వేళ సదరు పౌరుడు మిలటరీలో ఉంటే, 18 సంవత్సరాలు నిండితే సరిపోతుంది.‘‘కానిస్టిట్యూషనల్ క్యారీ’’ బిల్లు 2597కు ఈ ఏడాది ఫిబ్రవరిలో గవర్నర్ కెవిన్ స్టిట్ ఆమోదముద్ర వేయడంతో అది చట్టంగా రూపొందింది.

Telugu Oklahomaeffect, Telugu Nri Ups-

అయితే ఈ ఏడాది ఆగస్టులో టెక్సాస్, ఓహియోలోని డేటన్‌లో జరిగిన కాల్పుల ఘటన తర్వాత డెమొక్రటిక్ సభ్యుడు జాసన్ లోవ్ ఒక పిటిషన్ వేశారు.‘‘కానిస్టిట్యూషన్ క్యారీ’’ చట్టం అమల్లోకి రాకుండా స్టే విధించి 2020లో ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా అమలు చేయాలని ఆయన కోరారు.కానీ జాసన్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.దీంతో ‘‘కానిస్టిట్యూషన్ క్యారీ’’ చట్టం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది.అయితే ఈ బిల్లు మహిళకు మరింత ప్రమాదకరంగా మారుతుందని అలాగే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులపై మరింత ఒత్తిడి పెంచుతుందని కొందరు విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube