నియోజకవర్గాల వారీగా సర్వే ? పీకే ను దించుతున్న జగన్ ? 

ఏపీలో నియోజకవర్గాల వారీగా వైసిపి పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని జగన్ తెలుసుకోవాలి అనుకుంటున్నారు.  ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో సానుకూలత పెరిగిందని, తమ ప్రభుత్వానికి ఇక తిరుగు ఉండదని, మరో పది,  పదిహేనేళ్ల పాటు ముఖ్యమంత్రిగా జగన్ నమ్మకంతో ఉంటూ వచ్చారు.

 Constituency Wise Jagan With Prashant Kishore On Party Situation Survey-TeluguStop.com

ఈ మేరకు తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమను గట్టెక్కి స్థాయి అనే నమ్మకంతో ఉంటూ వస్తున్నారు.దీనికి తగ్గట్టుగానే ఇటీవల జరిగిన పంచాయతీ,  మున్సిపల్ ఎన్నికలతో పాటు,  ఈరోజు వెలువడుతున్న ఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగానే ఉన్నాయి.

అయినా పార్టీ పరిస్థితి పై జగన్ ఆందోళన మాత్రం తగ్గలేదు.కాకపోతే టిడిపి, జనసేన పార్టీ లు బలపడుతున్న తీరు కంగారు పుట్టిస్తోంది.
  ఈ క్రమంలోనే 2024 ఎన్నికలే టార్గెట్ గా తమ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ ను మళ్లీ జగన్ రంగంలోకి దించుతున్నారు.ఈ విషయాన్ని స్వయంగా చెప్పడంతో, మళ్లీ ఎన్నికల నాటికి ప్రశాంత్ కిషోర్ సలహాలు, సూచనలతోనే జగన్ ఎన్నికల కు వెళ్లిపోతున్నారని అర్థం అయింది.

 Constituency Wise Jagan With Prashant Kishore On Party Situation Survey-నియోజకవర్గాల వారీగా సర్వే పీకే ను దించుతున్న జగన్  -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

  అయితే ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసేందుకు,  జగన్ ఆదేశాలతో ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించి ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది ? అక్కడ రాబోయే ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా రంగంలోకి దించితే తిరుగు ఉండదు అనే అంశాలపై ప్రశాంత్ కిషోర్ టీం తో సర్వే నిర్వహించి  జగన్ కు నివేదిక ఇస్తారట.
 

Telugu Ap, Ap Government, Ap Politics, Chandrababu, Jagan 2024 Elections Target, Pk, Prasanth Kishore, Prasanth Kishore Sarve, Prasanth Kishore Team, Sitting Mlas, Tdp, Ysrcp-Telugu Political News

ఆ నివేదిక ఆధారంగానే జగన్ కీలక నిర్ణయాలు తీసుకుని పార్టీని ప్రక్షాళన చేసేందుకు సిద్దం అవుతున్నారట.అయితే ప్రశాంత్ కిషోర్ చేపట్టబోయే సర్వేపై ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.నియోజకవర్గాల్లో ఏ అంశాలపై ఆయన టీం సర్వే నిర్వహిస్తుంది ? తమ పనితీరుకు ఈ విధంగా మార్పు వస్తుంది ? రాబోయే ఎన్నికల్లో తమకు సీటు గ్యారంటీనా లేక తమను మార్చేస్తారా అనే టెన్షన్ లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.   

.

#Mlas #PrasanthKishore #PrasanthKishore #Jagan Target #Chandrababu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు