అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కానిస్టేబుల్ భార్య..

టెక్నాలజీ పెరిగే కొద్దీ మనుషులలో ఓపిక నశిస్తుంది.ప్రతి చిన్న విషయానికి చావడమో.

 Constable Wife Suspected Death In Vijayawada-TeluguStop.com

లేదా చంపడమో చేస్తున్నారు.తాజాగా విజయవాడలో ఒక ఘటన జరిగింది.

కానిస్టేబుల్ భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది.భర్త డ్యూటీకి వెళ్లి వచ్చే సరికి ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

 Constable Wife Suspected Death In Vijayawada-అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కానిస్టేబుల్ భార్య..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవు.మరి ఎందుకు చనిపోయిందో ఎవ్వరికి తెలియడం లేదు.అయితే ఆమె రాసిన సూసైడ్ నోట్ మాత్రం పోలీసులకు అనుమానం వచ్చేలా చేస్తుంది.పోలీసులు తెలిపిన వివరాలు.

విజయనగరం జిల్లా గరివిడి మండలం యెండపల్లి గ్రామానికి చెందిన కృష్ణారావుకు, శ్రీకాకుళం జిల్లా జి.సింగడం మండలం పిఆర్ వలస గ్రామానికి చెందిన రజినీతో 2015 సంవత్సరంలో వీరికి వివాహమైంది.ఈ దంపతులకు 15 నెలల కుమారుడు కూడా ఉన్నాడు.

ప్రస్తుతం వీరు గొల్లపూడిలోని మౌలా నగర్ లో నివాసముంటున్నారు.కృష్ణారావు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు కానీ.

విబేధాలు కానీ లేవు.కానీ రజని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వల్ల అనేక అనుమానాలు వస్తున్నాయి.

కృష్ణారావు ఫిబ్రవరి 11 వ తేదీన రాత్రి డ్యూటీకి వెళ్తూ రజిని ఇంట్లో ఉండగానే బయట తాళం వేసి వెళ్ళాడు.12 వ తేదీ ఉదయం కృష్ణారావు డ్యూటీ దిగి ఇంటికి వచ్చేముందు 7 గంటలకు రజనీకి ఫోన్ చేయగా టిఫిన్ తీసుకురమ్మని చెప్పింది.కృష్ణారావు టిఫిన్ తీసుకుని 9 గంటలకు ఇంటికి వచ్చి తలుపులు తీసి చూడగా రజని ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది.

ఇది చూసి కంగారుపడి కృష్ణారావు వెంటనే భవానీపురం పోలీసులకు సమాచారం అందించాడు.

పోలీసులు ఘటన జరిగిన ప్రదేశానికి వచ్చి పరిశీలించగా పోలీసులకు రజని డైరీతో పాటు సూసైడ్ నోట్ లభించింది.అందులో రాసి ఉన్నది చూసి పోలీసులకు అనుమానం వచ్చింది.

సూసైడ్ నోట్ లో.నా భర్త మంచివాడని.రాత్రిపూట నాకు పిచ్చి పిచ్చి కళలు వస్తున్నాయని అందుకే చనిపోతున్నానని.అందులో రాసి ఉంది.

రజని మృతి పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఆమె మొబైల్ స్వాధీనం చేసుకుని కృష్ణారావును విచారిస్తున్నారు.

భార్యను ఇంట్లో ఉంచి తాళం ఎందుకు వేశారని కృష్ణారావును అడగగా.తాను డ్యూటీకి వెళ్లి ఎప్పుడు వస్తానో తెలియదని.

భార్యను ఇబ్బంది పెట్టడం ఎందుకని తాళం వేస్తున్నట్లు తెలిపాడు. సూసైడ్ నోట్ నిజంగా రజనీనే రాసిందా.

లేకపోతే మరెవరైనా రాశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది.

#Suspected Death #Rajini #Suicide #Suicide Note #Krishnarao

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు