వివాహేతర సంబంధం పెట్టుకోవాలని మహిళను వేధిస్తున్న కానిస్టేబుల్..

ఒక స్థాయి పదవిలో ఉండి నలుగురికి చెప్పాల్సిన వారే ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారు.హైదరాబాద్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఒక మహిళను మీ ఆయన ఇంట్లో లేనప్పుడు మా ఇంటికి రా.

 Constable Venkateswarlu Sent To Jail For Harassing Women, Hyderabad, Policeman,-TeluguStop.com

అని వేధిస్తున్నాడు.పోలీసు అయిఉండి మహిళలకు భద్రత ఇవ్వాల్సింది పోయి అతనే మహిళను వేధింపులకు గురి చేస్తున్నాడు.

మాదన్నపేట పోలీస్ స్టేషన్ లో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు.అయితే ఆ కానిస్టేబుల్ ఇంటి పక్కనే ఒక గిరిజన మహిళ నివాసముండేది.ఆమె కానిస్టేబుల్ భార్యతో సన్నిహితంగా ఉండేది.అందువల్ల అప్పుడప్పుడు ఆ కానిస్టేబుల్ ఇంటికి వచ్చేది.

ఆ సమయంలో కానిస్టేబుల్ కన్ను ఆ గిరిజన మహిళపై పడింది.ఆమెపై రోజురోజుకు కోరిక పెరిగిపోయింది.ఎలాగైనా ఆ మహిళతో వివాహేతర సంభందం పెట్టుకోవాలని అనుకున్నాడు.ఇంకా అప్పుడు నుండి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు.

ఆ కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఆ మహిళ వేరే బస్తీలోకి మారిపోయారు.

Telugu Hyderabad, Policeman, Attempt, Remand, Suspend-Latest News - Telugu

వేరే బస్తీలో ఇల్లు తీసుకున్న అతని వేధింపులు తగ్గలేదు.ఆమె ఉంటున్న ఇంటి అడ్రస్ తెలుసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి వేధించడం మొదలుపెట్టాడు.ఇంక ఆ వేధింపులు భరించలేక ఆమె, ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేయాలనీ అనుకున్నారు.

అయితే ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు ఆ మహిళ ఇంటికి వచ్చి ఇంక ఎప్పుడు ఇబ్బంది పెట్టనని బ్రతిమిలాడాడు.తప్పు తెలుసుకున్నాడని అనుకుని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చెయ్యలేదు.

కొన్ని రోజులు ఆమెను ఇబ్బంది పెట్టలేదు.

అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకుని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు.

ఇంట్లో మీ ఆయన లేని సమయంలో మా ఇంటికి రా.అని ఫోన్ లో ఇబ్బంది పెట్టసాగాడు.నాతో వివాహేతర సంభందం పెట్టుకోకపోతే పెట్రోల్ పోస్తా అని భెదిరించాడు.

ఆ మహిళ భర్త ఇంట్లో లేని సమయంలో కానిస్టేబుల్ ఆమె ఇంటికి వెళ్లి ఆ మహిళపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు.

ఇంట్లో ఉన్న పిల్లలు, ఆ మహిళ గట్టిగా కేకలు వేయడంతో భయపడి అక్కడి నుండి పారిపోయాడు.ఆ ఘటనతో తీవ్ర భయాందోళనలకు లోనైనా మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసాడు.

కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కానిస్టేబుల్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

కానిస్టేబుల్ ఉద్యోగం నుండి సస్పెండ్ చేసారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube