భార్యకు భరణం చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో కిరాతకానికి ఒడిగట్టిన భర్త.. !

ఏదైనా పాపం చేయాలంటే ఆలోచించాలి.ఒక మంచి చేయాలంటే వెంటనే చేయాలని అంటారు పెద్దలు.

 Conspiracy To Murder Wife While In-TeluguStop.com

కానీ నేడు సమాజంలో చేడు పనికి ఆలోచించడం లేదు.ఎంతకు తెగించైనా, పెద్ద మొత్తంలో ఖర్చు చేసైనా సరే నిండు ప్రాణాలను నిర్ధాక్షిణ్యంగా తీసున్నారు.

నిజానికి ఒక ప్రాణం నిలపాలంటే ఎంత కష్టమో, అదే ప్రాణం తీయాలంటే అంతే సులువుగా మారిపోయింది.ఇకపోతే ఒక యువతి చేసుకున్న పెళ్లి ఆమె పాలిట మృత్యు దేవతగా మారింది.

 Conspiracy To Murder Wife While In-భార్యకు భరణం చెల్లించాల్సి వస్తుందన్న కారణంతో కిరాతకానికి ఒడిగట్టిన భర్త.. -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ వివరాలు చూస్తే.అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న విష్ణు అనే అతనికి జయభారతి కి 2015లో వివాహం జరిగింది.

అయితే కొంత కాలానికి దంపతుల మధ్య విభేదాలు రావడంతో, అమెరికా నుంచి వచ్చేసిన జయభారతి తన తల్లిదండ్రులతో కలసి ఉంటూ ఓ పోస్టాఫీసులో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తుందట.ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న భర్త భార్యను హత్య చేసి దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయగా, అనుమానంతో మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారట.

ఈ నేపధ్యంలో విడాకుల నోటీస్ పంపిన భార్యకు ఎక్కడ భరణం చెల్లించాల్సి వస్తుందన్న పిసినాసి తనంతో ఈ హత్య చేయించినట్లు తెలిసింది.ఇకపోతే విష్ణును అరెస్ట్ చేసేందుకు పోలీసులు అమెరికాలోని భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్టు సమాచారం.

#America #NRiHusband #Alimony #Murder #Divorce

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు