సాధారణంగా ప్రతి ఒక్కరికి నిద్రపోతే కలలు రావడం సర్వసాధారణం.కొందరు పగలు నిద్ర పోయినా కూడా కలలు వస్తుంటాయి.
మరి తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని చాలా మంది భావిస్తుంటారు.మనం నిద్ర పోయేటప్పుడు మనకు సంబంధం లేనటువంటి ఏవేవో కలలు వస్తుంటాయి.
కొన్నిసార్లు ఆ కల ఏమిటో కూడా మనకు గుర్తుండదు.మరికొన్నిసార్లు తరచు మన కుటుంబ సభ్యులు కలలో కనిపిస్తుంటారు.
అయితే ఈ విధంగా తరచూ కుటుంబ సభ్యులు కలలో కనిపిస్తే వాళ్లకు ఏం జరుగుతుందోనని కొంతవరకు ఆందోళన చెందుతుంటారు.కలలో ఎవరు కనిపిస్తే ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం.
కొందరు స్త్రీలకు కలలో తరచూ తన భర్త కనిపిస్తుంటారు.ఈ విధంగా భర్త కనిపించడం వల్ల తనకు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతారు.అయితే భర్త తరచూ కలలో కనిపించడం వల్ల అతని ఆయుష్షు పెరుగుతుందని, ఆ స్త్రీ నిత్యం పసుపు, కుంకుమలతో దీర్ఘ సుమంగళిగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.అదేవిధంగా భర్తకి భార్య కలలో వస్తే అతడికి ధనలాభం కలుగుతుంది.
ఉద్యోగాలలో ప్రమోషన్లు వస్తాయి.ఇక కలలో అత్త చనిపోయినట్లు కనిపిస్తే ఆ ఇంట ధన లాభం కలుగుతుందని భావిస్తారు.
మరికొందరికి వారి తల్లిదండ్రులు కలలో కనిపిస్తుంటారు.ఈ విధంగా తల్లిదండ్రులు కలలో కనిపిస్తే శుభవార్తలు వింటారు.కలలో సూర్యుడు కనిపిస్తే సంఘంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.కలలో అన్నదమ్ములు మనకు డబ్బులు ఇచ్చినట్లు కనిపిస్తే మన ఇంట ధన లాభం పెరుగుతుంది.
కొందరికి కలలో వారి కుటుంబ సభ్యులకు ఏదో హాని జరుగుతున్నట్లు, కొన్ని ప్రమాదాలకు గురైనట్లు కళలు వస్తుంటాయి.ఈ విధమైనటువంటి కలలో వస్తే ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదు.
ఎవరైతే ప్రమాదంలో ఉన్నట్టు కనిపిస్తే ఆలయానికి వెళ్ళి వారి పేరు పై అర్చన చేయిస్తే వారికి ఉన్న దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.